Nara lokesh : లోకేష్ కు ట్యూన్ కాకపోతే ఇక అంతే?
తెలుగుదేశం పార్టీ భావి నేత లోకేష్ కు అందరూ ట్యూన్ కావాల్సిందే. ఆయన చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించి తీరాల్సిందే. లేకుంటే మీ దారి మీరు [more]
;
తెలుగుదేశం పార్టీ భావి నేత లోకేష్ కు అందరూ ట్యూన్ కావాల్సిందే. ఆయన చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించి తీరాల్సిందే. లేకుంటే మీ దారి మీరు [more]
తెలుగుదేశం పార్టీ భావి నేత లోకేష్ కు అందరూ ట్యూన్ కావాల్సిందే. ఆయన చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించి తీరాల్సిందే. లేకుంటే మీ దారి మీరు చూసుకోండి అని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సంకేతాలు ఇస్తున్నట్టే కనపడుతుంది. నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీలో జూనియర్ నేతలతో సమానంగా సీనియర్ నేతల సంఖ్య ఉంది. ఇప్పుడు వారంతా లోకేష్ నాయకత్వాన్ని విధిగా అంగీకరించాల్సి వస్తుంది.
భావినేతే అయినా..?
తెలుగుదేశం పార్టీకి భావినేత లోకేష్. ఇందులో ఎవరికీ వేరే సందేహం లేదు. అయితే చంద్రబాబు నాయకత్వంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్లడం మంచిదన్నది సీనియర్ నేతల అభిప్రాయం. లోకేష్, జగన్ లను పోల్చి చూసుకుంటే జగన్ వైపు జనం మరోసారి మొగ్గు చూపే అవకాశముందన్నది సీనియర్ నేతల భావన. కానీ ఇందుకు చంద్రబాబు అంగీకరించడం లేదు. తన నాయకత్వంలోనే వెళతామని బయటకు చెబుతున్నా జరుగుతున్నవన్నీ లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి.
సీనియర్లు మాత్రం…..
లోకేష్ ను భావినేతగా ప్రొటెక్ట్ చేయడానికి ఇటీవల కాలంలో చంద్రబాబు తెగ తంటాలు పడుతున్నారు. అందుకే ఆయన టూర్లను కూడా పెద్దగా చేయడం లేదు. అమరావతి నుంచే కథ అంతా నడిపిస్తున్నారు. ముఖ్యమైన సంఘటనలకు లోకేష్ హాజరవుతున్నారు. దీనిని సీనియర్లు తప్పుపడుతున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత లోకేష్ కు ఏ బాధ్యతలను అప్పగించినా ఇబ్బంది లేదని, ఇప్పుడు మాత్రం ఆ సంకేతాలివ్వకండి అని సీనియర్ నేతలు చెబుతున్నారు.
రాంగ్ సిగ్నల్స్ అంటూ…..
మంత్రిగా ఉన్నప్పుడే లోకేష్ బాధితులైన సీనియర్ నేతలు మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు పార్టీలో ఆధిపత్యం ఆయనకిస్తే జిల్లాల్లో తమ పట్టు తగ్గిపోతుందన్నది సీనియర్ల భయంగా ఉంది. ఇప్పటికే పార్టీ నాయకత్వంపై రాంగ్ సిగ్నల్స్ వెళుతున్నాయి. దానిని మరింత ముదరనీయ వద్దన్నది సీినియర్ నేతల అభ్యర్థన. కానీ చంద్రబాబు మాత్రం లోకేష్ విషయంలో రాజీ లేదన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద టీడీపీలో సీనియర్లు లేవనెత్తతున్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.