‍‍Nara lokesh : ఏది జరిగినా లోకేష్ కు చుట్టుకుంటుందే?

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సంఘటన లోకేష్ ను ఇబ్బంది పెట్టేలా ఉంది. ఏ సంఘటన జరిగినా లోకేష్ టార్గెట్ అవుతున్నారు. ఆయన నాయకత్వాన్ని ఎద్దేవా చేస్తున్నారు. రాజకీయాలకు [more]

;

Update: 2021-10-21 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సంఘటన లోకేష్ ను ఇబ్బంది పెట్టేలా ఉంది. ఏ సంఘటన జరిగినా లోకేష్ టార్గెట్ అవుతున్నారు. ఆయన నాయకత్వాన్ని ఎద్దేవా చేస్తున్నారు. రాజకీయాలకు పనికిరానివాడిగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుంది. అసలే లోకేష్ రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు సంఘటన కూడా లోకేష్ ను ఇరకాటంలోకి నెట్టేసింది. లోకేష్ నాయకత్వాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు.

నాయకత్వంపై….?

నారా లోకేష్ నాయకత్వంపై తెలుగుదేశం పార్టీలోనే అనుమానాలున్నాయి. చంద్రబాబు నాయకత్వాన్నే ఎక్కువ మంది పార్టీలో కోరుకుంటున్నారు. చంద్రబాబు తర్వాత టీడీపీని లోకేష్ నడపలేరని సొంత పార్టీ నేతలే అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఇటీవల చంద్రబాబు కొంత తగ్గమని చెప్పినట్లుంది. కేవలం ట్విట్టర్ కే పరిమితమై ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఏపీలో ఉండకుండా….

వైసీీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయంపై దాడులు జరిగినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ లో లేరు. హైదరాబాద్ లో ఉన్నారు. దీనిపై కూడా పార్టీలో కామెంట్స్ వినపడుతున్నాయి. చంద్రబాబు వయసు రీత్యా వారానికి ఒకసారి హైదరాబాద్ వెళ్లి వస్తున్నారని, లోకేష్ మాత్రం హైదరాబాద్ ను వదిలి రావడం లేదని పార్టీలో నేతలు అభిప్రాయపడుతున్నారు. లోకేష్ కనీసం నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు కూడా విన్పిస్తున్నాయి.

పవన్ దగ్గరవ్వడం…..

మరోవైపు పవన్ కల్యాణ‌్ దగ్గర కావడం కూడా నారా లోకేష్ నాయకత్వానికి ఇబ్బందిగా మారింది. పార్టీ నేతలు భవిష‌్యత్ లో తనకంటే పవన్ కల్యాణ్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారన్న భయం కూడా లోకేష్ లో లేకపోలేదంటున్నారు. తాను అన్ని విధాలుగా తయారైనా నాయకత్వం విషయం వచ్చేసరికి ప్రతి సంఘటనను లోకేష్ కు అన్వయిస్తున్నారు. లోకేష్ రాజకీయంగా ఎదగక పోవడం వల్లనే ఫ్రస్టేషన్ తో ఉన్నారని వైసీపీ నేతలు కామెంట్స్ చేయడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. మొత్తం మీద ఏపీలో ఏ సంఘటన జరిగినా అది లోకేష్ కు చుట్టుకుంటుంది.

Tags:    

Similar News