Nara lokesh : అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారా?
అవును… భయపడి పారిపోతే నాయకుడనిపించుకోరు. పోయిన చోటే వెతుక్కోవడం ఉత్తముల లక్షణం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సయితం అదే పనిచేస్తున్నారు. ఎద్దేవా [more]
;
అవును… భయపడి పారిపోతే నాయకుడనిపించుకోరు. పోయిన చోటే వెతుక్కోవడం ఉత్తముల లక్షణం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సయితం అదే పనిచేస్తున్నారు. ఎద్దేవా [more]
అవును… భయపడి పారిపోతే నాయకుడనిపించుకోరు. పోయిన చోటే వెతుక్కోవడం ఉత్తముల లక్షణం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సయితం అదే పనిచేస్తున్నారు. ఎద్దేవా చేసిన వారి నోళ్లు మూయించాలని డిసైడ్ అయ్యారు. అందుకే తాను తిరిగి మంగళగిరిలోనే పోటీ చేసి విజయం సాధించి తన తండ్రికి కానుకగా ఇవ్వాలని భావిస్తున్నారు. ఇటీవల రెండు రోజుల పాటు మంగళగిరి పార్టీ నేతలతో లోకేష్ సమావేశమయ్యారు.
ప్రత్యేకంగా సమావేశమై….
నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో రోజురోజుకూ వైసీపీ బలహీనపడిపోతుందని వారు సమాచారమిచ్చారు. అంతేకాదు ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసే అవకాశం లేదని కూడా వారు చెప్పారు. మంగళగిరిలోని ప్రధాన సామాజికవర్గాల్లో అధికార పార్టీపై అసంతృప్తి నెలకొని ఉందని వివరించారు. ఈసారి విజయం తెలుగుదేశం పార్టీదేనన్న ధీమాను వ్యక్తం చేశారు.
అసంతృప్తి ఉందని గుర్తించి…
నిజానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఎన్నికల్లోనే పోటీకి విముఖత చూపారు. జగన్ బలవంతం చేసి పోటీకి దింపారు. ఈసారి నియోజకవర్గం మార్చాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రాజధాని రగడ, భూముల ధరలు తగ్గిపోవడం, ఉపాధి అవకాశాలు మంగళగిరిప్రాంతంలో తగ్గడంతో ప్రజల్లో అసంతృప్తి ఉందని నారా లోకేష్ గుర్తించారు. అందుకే ఆయన మంగళగిరిలో పోటీ చేసేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు.
ఓడిన చోటే….
అన్నీ ఆలోచించిన తర్వాతనే చంద్రబాబు దీక్షలో 2024లో తాను మంగళగిరి నుంచి పోటీ చేస్తానని నారా లోకేష్ ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యాలయం కూడా మంగళగిరి పరిధిలోనే ఉంది. దీనికి తోడు అక్కడి నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రత్యర్థుల నోళ్లు మూయించాలని నారా లోకేష్ డిసైడ్ అయ్యారు. ఒకసారి ఓడినంత మాత్రాన ప్రజలు తనను తిరస్కరించినట్లు కాదని ఆయన అంటున్నారు. మొత్తం మీద నారా లోకేష్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ వచ్చింది.