Nara lokesh : లోకేష్ పై నమ్మకం కలిగేదెప్పుడో?

పార్టీని ముంచినా తేల్చినా లోకేషేనట. నారా లోకేష్ పై నాయకుల్లోనే నమ్మకం ఏర్పడటం లేదు. పార్టీని నడిపించడం ఆయన వల్ల కాదని అనేక మంది నేతలు తేల్చేశారు. [more]

Update: 2021-11-06 12:30 GMT

పార్టీని ముంచినా తేల్చినా లోకేషేనట. నారా లోకేష్ పై నాయకుల్లోనే నమ్మకం ఏర్పడటం లేదు. పార్టీని నడిపించడం ఆయన వల్ల కాదని అనేక మంది నేతలు తేల్చేశారు. విపక్షంలో ఉన్న సమయంలో నాయకుడిగా ఎదగాల్సి ఉన్నా లోకేష్ లో ఆ ఫైర్ లేదన్నది వాస్తవం. ఎప్పుడో ఒకసారి వచ్చి ఏదో మాట్లాడేసి హైదరాబాద్ లో ఉండటం తప్ప లోకేష్ ఈ రెండున్నరేళ్లలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు స్వల్పమేనని చెప్పాలి.

అధికారంలో ఉన్నప్పుడు…

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటూ నాయకుడిగా ఎదగలేకపోయారు. మంత్రిగా బాధ్యతలను స్వీకరించి ఆయన నాలుగు గోడలకే పరిమితమయ్యారు. ఇక తాను ఓటమి చెందడమే కాకుండా, పార్టీ అధికారాన్ని కోల్పోయినప్పుడు నిత్యం జనంలో ఉండేలా చూసుకోవాలి. కానీ లోకేష్ ఎప్పుడూ రెస్ట్ మోడ్ లో ఉంటాడన్నది పార్టీ నేతల నుంచి విన్పిస్తున్న టాక్. లోకేష్ జనంలోకి వెళ్లేందుకు కాని, కార్యకర్తలను కలిసేందుకు కాని పెద్దగా ప్రయత్నించరు.

పరామర్శలకే…

నారా లోకేష్ కేవలం పరామర్శలకే పరిమితమయ్యారు. తండ్రి 70 పదుల వయసులో 36 గంటలు దీక్ష పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే కనీసం జిల్లాల్లో పర్యటించి పార్టీని గాడిన పెట్టేందుకు కూడా చినబాబు ట్రై చేయడం లేదు. పైగా నారా లోకేష్ పై పార్టీలో మరో భయం ఉంది. అభ్యర్థుల ఎంపిక కూడా ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతుందని, పార్టీ అధికారంలోకి వస్తే మంత్రులను కూడా లోకేష్ నిర్ణయిస్తారన్న టాక్ ఉంది.

జిల్లాల పర్యటనలు కూడా…

దీంతో చంద్రబాబు కు సీనియర్ నేతలు ఇప్పటికే చెప్పారు. లోకేష్ భాగస్వామ్యం తక్కువ ఉండేలా చూడాలని కోరారు. జిల్లాల్లో నారా లోకేష్ ను పర్యటింప చేసి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించాలని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కొందరు కోరుతున్నారు. కానీ నారా లోకేష్ మాత్రం ఎక్కువ సమయం హైదరాబాద్ కే పరిమితమవుతున్నారు. ఏపీకి చుట్టపుచూపుగా వచ్చి పోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మొత్తం మీద నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలోనే పార్టీ నేతలు, క్యాడర్ లోనే నమ్మకాన్ని కల్గించుకోలేకపోతున్నారు.

Tags:    

Similar News