Nara lokesh : ఇన్ వాల్వ్ చేయడం లేదట.. చినబాబుకు పెద్ద కష్టం
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత నారా లోకేష్ దే పెత్తనం. అయితే గత కొంత కాలంగా లోకేష్ పార్టీ నిర్ణయాలకు దూరంగా ఉంటున్నట్లు కనపడుతుంది. అధికార పార్టీపై [more]
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత నారా లోకేష్ దే పెత్తనం. అయితే గత కొంత కాలంగా లోకేష్ పార్టీ నిర్ణయాలకు దూరంగా ఉంటున్నట్లు కనపడుతుంది. అధికార పార్టీపై [more]
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత నారా లోకేష్ దే పెత్తనం. అయితే గత కొంత కాలంగా లోకేష్ పార్టీ నిర్ణయాలకు దూరంగా ఉంటున్నట్లు కనపడుతుంది. అధికార పార్టీపై లోకేష్ విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో లోకేష్ ను చంద్రబాబు ప్రధాన నిర్ణయాలకు దూరం పెట్టినట్లే కన్పిస్తుంది. చంద్రబాబు 36 గంటల దీక్ష నిర్ణయం కూడా లోకేష్ కు తెలియకుండానే జరిగిందంటున్నారు. సీనియర్ నేతలతో చర్చించిన తర్వాతనే చంద్రబాబు దీక్షకు దిగారంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో….
ఇక తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రంలో పన్నెండు మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. నేటితో నామినేషన్ల గడువు కూడా పూర్తి కావచ్చింది. అయితే ఇందులో లోకేష్ ఇన్ వాల్వ్ మెంట్ ఏదీ లేనట్లుగానే కన్పిస్తుంది. కనీసం ప్రచారానికి వస్తారా? రారా? అన్నది కూడా సందేహంగానే ఉంది. నెల్లూరు మున్సిపాలిటీలో అభ్యర్థుల ఎంపిక అంతా స్వయంగా చంద్రబాబు దగ్గరుండి చూసుకున్నారు.
అక్కడి నేతల అభిప్రాయాలకే….
అక్కడి స్థానిక నేతల అభిప్రాయాలను తీసుకుని చంద్రబాబు అభ్యర్థులను నిర్ణయించారు. అక్కడ వామపక్షాల పొత్తుల విషయంలోనూ స్థానిక నేతల నిర్ణయానికే చంద్రబాబు వదిలేశారు. దీంతో లోకేష్ ప్రమేయం లేకుండానే ఎన్నికలు జరిగిపోతున్నాయన్న టాక్ పార్టీలో వినపడుతుంది. లోకేష్ నేతలపై పట్టు సాధించడానికి ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని తెలిసినా చంద్రబాబు దూరంపెట్టడంపై పార్టీలో చర్చజరుగుతుంది.
రిజల్ట్ ఆ రకంగా వస్తాయనేనా?
స్థానిక ఎన్నికలు కావడంతో ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వానికే చంద్రబాబు బాధ్యతలను అప్పగించారు. ఈ విషయంలో లోకేష్ హర్ట్ అయినట్లు తెలుస్తోంది. తనను ఇన్ వాల్వ్ చేయకపోవడంపై మనస్తాపం చెందినట్లు కనపడుతుంది. వచ్చే ఎన్నికలు పూర్తయ్యే వరకూ లోకేష్ పరిస్థితి ఇంతేనని పార్టీలో చెవులు కొరుక్కుంటున్నారు. లోకేష్ నాయకత్వంపై నమ్మకం లేకపోవడం, రిజల్ట్ భిన్నంగా వస్తే ఆ ప్రభావం లోకేష్ పై పడుతుందనే చంద్రబాబు యువనేతను ఇన్ వాల్వ్ చేయలేదంటున్నారు.