జమిలి ఎన్నికలు నై… ఆ ఆలోచనలకు బ్రేక్

జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం వెనకగడుగు వేస్తున్నట్లే కనపడుతుంది. నిజానికి 2022 లో జమిలి ఎన్నికలకు వెళ్లాలన్నది మోదీ ఆలోచన. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు [more]

;

Update: 2021-03-10 18:29 GMT

జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం వెనకగడుగు వేస్తున్నట్లే కనపడుతుంది. నిజానికి 2022 లో జమిలి ఎన్నికలకు వెళ్లాలన్నది మోదీ ఆలోచన. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు తమకు అనుకూల ఫలితాలు ఇచ్చేలా కన్పించడం లేదు. దీంతో జమిలి ఎన్నికలకు వెళ్ల కూడదనే నిర్ణయానికి మోడీ ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై ప్రస్తుతమున్న వ్యతిరేకత తగ్గిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుంది.

పేద, మధ్యతరగతి ప్రజలు….

అందుకే యధా ప్రకారం లోక్ సభ ఎన్నికలు 2024లోనే జరగనున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. వరసగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరల కారణంగా ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. దాదాపు వంద రూపాయలకు పెట్రోలు చేరుకోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు మోదీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీని ప్రభావంతో నిత్యవసర వస్తువుల ధరలు కూడా నింగినంటాయి.

యువతలో అసహనం…

ఇక నిరుద్యోగ యువత కూడా మోదీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో తమకు ఉద్యోగాలేవంటూ మోదీ ప్రభుత్వాన్ని యువత ప్రశ్నిస్తుంది. దీనికితోడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బీజేపీ నేతలు కూడా ముందుగానే ఊహించినట్లున్నారు. ఏ రాష్ట్రంలోనూ బీజేపీకి అనుకూల పరిస్థితులు లేవు. దీంతో వెంటనే జమిలి ఎన్నికలకు వెళితే ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారు.

రెండేళ్ల పాలనను….

రెండేళ్ల పాలనను ఎందుకు పోగొట్టుకోవాలన్న యోచన కూడా మోదీ టీంలో ప్రారంభమయినట్లు తెలుస్తోంది. రానున్న మూడేళ్లలో ప్రజల్లో అసంతృప్తిని తగ్గించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో మోదీ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కే క్షేత్రస్థాయిలో అనుకూల వాతావరణం ఉందని భావిస్తున్నారు. అందుకే మోదీ జమిలి ఎన్నికల ఆలోచనను పక్కన పెట్టారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అంటే 2024లోనే సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

Tags:    

Similar News