వాటి మీద కేంద్రం ఉక్కుపాదం తప్పదా ?

నరేంద్ర మోడీ ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగేలా చేసినవి మూడే మూడు అంశాలు. ఒకటి గోద్రా అల్లర్ల సమయంలో ఆయన గుజరాత్ సిఎం ఉన్న సమయంలో. రెండోది [more]

;

Update: 2021-07-20 02:00 GMT

నరేంద్ర మోడీ ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగేలా చేసినవి మూడే మూడు అంశాలు. ఒకటి గోద్రా అల్లర్ల సమయంలో ఆయన గుజరాత్ సిఎం ఉన్న సమయంలో. రెండోది సోషల్ మీడియా దునియా ప్రభంజనం అవుతున్న దశలో అందులో దేశ్ కి నేత మోడీ అనేంతగా ప్రచారం సాగింది. అలాగే మూడోది అద్భుత ప్రసంగీకుడిగా మోడీ కి ఉన్న మాటల గారడీ. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆయన ఎదిగింది నేడు పడిపోతుంది సోషల్ మీడియా కారణంగానే అన్నది అందరికి తెలిసిన సత్యమే. ఇలా సోషల్ మీడియా ను ఆధారంగా చేసుకుని అచిరకాలంలోనే పాపులర్ అయిన వారిలో కేజ్రీవాల్ కూడా ఒకరు. ఆయన ముఖ్యమంత్రి స్థాయివరకు పరిమితం అయినా ఉత్తరాదిన తన పార్టీని బాగానే విస్తరించగలిగారు.

సాంప్రదాయ మీడియాకు వ్యాపారాలతో లింక్ …

సాంప్రదాయ మీడియా ప్రభుత్వాల చేతుల్లో తప్పనిసరిగా నడవాలిసిన పరిస్థితి ఉంది. ఆ మీడియా ను నిర్వహించేవారి వెనుక వుండే వ్యాపారాలు దీనికి ప్రధాన కారణం. ఇవి కాక తమ ప్రసార మాధ్యమాలు ప్రకటనలపై ఆధారపడి బతుకు ఈడుస్తాయి. ఇన్ని కారణాల రీత్యా ప్రజల్లో ప్రభుత్వం పై ఉండే వ్యతిరేకతను ఈ మీడియా సంస్థలు ప్రస్ఫుటింప చేయలేవు. ఈ బలహీనత కారణంగా కేంద్రంలో ఉండేవారి గుప్పెట్లోనే మీడియా ఒకరకంగా బందీ గా ఉంటూ కాలక్షేపం చేయాలిసిందే. అయితే సోషల్ మీడియా విస్తరించాక ప్రపంచ వ్యాప్తంగా వీటి కారణంగా ప్రభుత్వాలు కుప్పకూలుతున్నాయి. కొన్ని చోట్ల ప్రజా ఉద్యమాలతో తిరుగుబాట్లు సైతం చోటుచేసుకున్న పరిస్థితులు ఉన్నాయి.

వచ్చే ఎన్నికల్లోగా తొక్కాలనేనా …?

ఈ నేపథ్యంలో ప్రస్తుతం మోడీ సర్కార్ కన్ను సోషల్ మీడియా కట్టడిపై పడింది. మరో ముడేళ్ళల్లో జరగబోయే ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్ర గతంలో లేనంత విస్తృతంగా ఉండబోతుంది. అది ఇప్పటికే అంచనా వేసిన కేంద్రం ముందుగా ట్విట్టర్ తో యుద్ధం మొదలు పెట్టింది. ట్విట్టర్ సైతం కేంద్రంతో పోరుకు కాలుదువుతుంది. తాజాగా జమ్మూకాశ్మీర్ లోని లద్ధాఖ్ ను చైనా అంతర్భాగంగా చూపి తన జుట్టు మోడీ సర్కార్ చేతిలో పెట్టేసింది. ఇదే అదనుగా ట్విట్టర్ పై గట్టిపోరాటానికి కేంద్రం నడుం కట్టింది. దీని సంగతి తేల్చిన తరువాత మిగతా వాటి పని పట్టడానికి రెడీ అవుతుంది. వాస్తవానికి సోషల్ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటున్నాయో అంతే నష్టాలు కలుగుతున్నాయి. ఆ నష్టాలను నివారించే దిశగా చర్యలు తీసుకుని వ్యవస్థను గాడిన పెడితే మంచిదని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. లేకపోతే కేవలం వాటి అణచివేతే లక్ష్యంగా పనిచేస్తే మాత్రం మోడీ సర్కార్ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిందనే చెడ్డపేరును ఇందిర ఎమర్జెన్సీ కాలంలో తెచ్చుకున్న విధంగా ముద్ర వేసుకుంటారన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో సైతం వినిపిస్తుంది.

Tags:    

Similar News