ముందు చూపుతోనే నీలం నియామకమా?

నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. జగన్ ముందు చూపుతోనే నీలం సాహ్ని పేరును గవర్నర్ కు సిఫార్సు చేశారు. పేరు సిఫార్సులో శామ్యూల్, [more]

;

Update: 2021-03-27 06:30 GMT

నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. జగన్ ముందు చూపుతోనే నీలం సాహ్ని పేరును గవర్నర్ కు సిఫార్సు చేశారు. పేరు సిఫార్సులో శామ్యూల్, ప్రేమ చంద్రారెడ్డి పేర్లున్నా నీలం సాహ్ని నియామకానికే జగన్ ఆసక్తి చూపారు. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా నీలం సాహ్ని నేతృత్వంలోనే జరుగుతాయి. న్యాయస్థానాలతో ఇబ్బంది లేకుండా సజావుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు నీలం సాహ్ని నియామకం ఉపయోగపడుతుంది.

జగన్ ఆలోచనలకు…..

నీలం సాహ్ని సీనియర్ ఐఏఎస్ అధికారి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఆమెను నియమించడంలో ఎలాంటి వివాదం లేదు. జగన్ ఆలోచనలకు అనుగుణంగా నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారంటారు. తొలి చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని తప్పించడానికి కూడా జగన్ మాట వినకపోవడమే. నీలం సాహ్ని మాత్రం జగన్ ఏపని అప్పగించినా చక్కగా చేసుకుపోయారు. అందుకే ఆమె పదవీ కాలాన్ని జగన్ ఆరు నెలల పాటు అప్పట్లో పొడిగించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.

వివాదాలకు దూరంగా…..

తాను చీఫ్ సెక్రటరీగా బాధ్యతలను చేపట్టిన తర్వాత నీలం సాహ్ని ఎలాంటి వివాదాలకు పోలేదు. అధికారులతోనూ సమన్వయంతో వ్యవహరించారు. జగన్ ఇప్పటికిప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగాలని బలంగా కోరుకుంటున్నారు. అందుకే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను సయితం వాయిదా వేశారు. ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ ను ప్రవేశపెట్టుకున్నారు. నీలం సాహ్ని రాకతో వచ్చే నెల మొదటి వారంలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశముందంటున్నారు.

ఐదేళ్ల తర్వాత కూడా…..

తిరుపతి ఉప ఎన్నిక అడ్డంకి వస్తే ఏప్రిల్ 17వ తేదీ తర్వాత నీలం సాహ్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనున్నారని చెబుతున్నారు. ఇక జగన్ మరో ఆలోచన. ఐదేళ్ల తర్వాత మళ్లీ పంచాయతీలు, మున్సిపల్, కార్పొరేషన్లకు జరిగే ఎన్నికలకు కూడా నీలం సాహ్నియే పర్యవేక్షిస్తారు. తాను అధికారంలో ఉన్నా లేకున్నా నీలం సాహ్ని తనకు టీడీపీకి నిమ్మగడ్డ మాదిరి ఉపయోగపడతారని భావించి ఉండవచ్చు. అందుకే ఏరికోరి జగన్ నీలం సాహ్ని పేరును సిఫార్సు చేశారంటున్నారు.

Tags:    

Similar News