కటీఫ్ కు కొద్ది దూరంలో?

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో అంచనాలు తలకిందులవుతున్నాయి. జార్ఖండ్, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ కూటమిలోని పార్టీల్లోనూ కొంత మార్పు కన్పిస్తుంది. [more]

Update: 2020-01-16 17:30 GMT

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో అంచనాలు తలకిందులవుతున్నాయి. జార్ఖండ్, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ కూటమిలోని పార్టీల్లోనూ కొంత మార్పు కన్పిస్తుంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని దేశ వ్యాప్తంగా బలపర్చిన ప్రజలు రాష్ట్రాల విషయానికి వచ్చే సరికి అందుకు విరుద్ధమైన తీర్పు చెబుతున్నారు. రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఎదురుగాలి వీస్తుంది. దీంతో బీహార్ ఎన్నికల్లోనూ తమకు కష్టాలు తప్పవని జేడీయూ నేత నితీష్ కుమార్ అంచనాకు వచ్చినట్లుంది.

భాగస్వామిగా ఉన్నా….

బీహార్ లో ఇప్పటికే బీజేపీ, జేడీయూలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయ. గత లోక్ సభ ఎన్నికల్లోనూ కలసి పోటీ చేసి మంచి ఫలితాలను సాధించాయి. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి ఈ ఫలితాలు తారుమారు అవుతాయన్న ఆందోళన నితీష్ కుమార్ లో ఉంది. దీనికి తోడు పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారు. బీహార్ లో నిర్వహించిన సర్వేలో బీజేపేీ, జేడీయూ కూటమికి అధికారంలోకి వచ్చే సంఖ్యలు స్థానాలు రావన్నది ఆయన తేలినట్లు చెబుతున్నారు.

పీకే సర్వేలో….

అందుకే గత కొంతకాలంగా ప్రశాంత్ కిషోర్ బీజేపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సీఏఏ, ఎన్సార్సీ విషయంలో ప్రశాంత్ కిషోర్ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. లోక్ సభ, రాజ్యసభలో నితీష్ కుమార్ పౌరసత్వ చట్ట సవరణకు మద్దతు ఇచ్చినప్పటికీ ప్రశాంత్ కిషోర్ మాత్రం వ్యతిరేకిస్తూ వస్తున్నారు. పైగా ప్రియాంక గాంధీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దీన్ని బట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దూరంగా ఉండటమే బెటరని ఆయన నితీష్ కుమార్ కు పరోక్షంగానే చెబుతూ వస్తున్నారు.

ఝలక్ ఇచ్చేందుకేనా?

తాజాగా నితీష్ కుమార్ కూడా స్వరం మార్చారు. సీఏఏ విషయంలో తాము వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఇందులో మార్పులు చేయాలని పరోక్షంగా బీజేపీ సర్కార్ కు హెచ్చరిక పంపారు. ఈ చట్టంపై ప్రత్యేకంగా చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రత్యేక సమావేశాన్ని సీఏఏ పై ఏర్పాటు చేయాలని లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేయడంతోనే నితీష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్సార్సీనీ బీహార్ లో అమలు చేయడం లేదని ఇప్పటికే స్పష్టం చేసిన నితీష్ కుమార్ సీఏఏ విషయంలోనూ అడ్డం తిరగడంతో బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News