జగన్ తమ వెనక ఉన్నారన్న ధీమాయేనా?
స్థానిక ఎన్నికల అంశం ఇపుడు ఏపీలో ముందుకు కదులుతోంది. ఎలా చూసుకున్నా ఎన్నికలు కాస్తా ముందూ వెనకా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే విశాఖ [more]
;
స్థానిక ఎన్నికల అంశం ఇపుడు ఏపీలో ముందుకు కదులుతోంది. ఎలా చూసుకున్నా ఎన్నికలు కాస్తా ముందూ వెనకా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే విశాఖ [more]
స్థానిక ఎన్నికల అంశం ఇపుడు ఏపీలో ముందుకు కదులుతోంది. ఎలా చూసుకున్నా ఎన్నికలు కాస్తా ముందూ వెనకా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే విశాఖ వంటి ప్రతిష్టాత్మకమైన కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే విజయం ఎవరిని వరిస్తుంది అన్నది చర్చగా ఉంది. అయితే ఈ మధ్యనే ఒక సర్వే బయటకు వచ్చింది. ఆ సర్వేలో అధికార వైసీపీకి ఏపీవ్యాప్తంగా ఆదరణ బాగా పెరిగిందని, మరో మూడు శాతం ఓట్లు అదనంగా రాబట్టారని కూడా సర్వే ఫలితాలు చెప్పాయి. ఆ లెక్కన చూసుకుంటే విశాఖలో వైసీపీ విజయం నల్లేరు మీద బండి లాంటిదేనని అంటున్నారు.
ఎనభై శాతమా….?
విశాఖ కార్పొరేషన్లో సీట్లు 99 కి పెంచారు. ఎనభై శాతానికి పైగా వైసీపీకి సీట్లు వస్తాయని సర్వేలే కాదు, వైసీపీ నేతలు కూడా అంటున్నారు. ఆ లెక్కన గతంలో ఎన్నడూ లేని మెజారిటీ సీట్లు వైసీపీ పరం అవుతాయా అన్న చర్చ కూడా సాగుతోంది. విశాఖలో చూసుకుంటే నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఉన్నా అందులో దక్షిణ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సైకిల్ దిగిపోయి జగన్ కి జై కొట్టారు. ఇక ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన నియోజకవర్గంలో కాడి వదిలేసారు. పశ్చిమలో వైసీపీ జోరు పెరుగుతోంది. తూర్పులో ఎమ్మెల్యే వెలగపూడి కొంత టఫ్ ఇస్తున్నా అధికారం చేతిలో ఉంది కాబట్టి ఎడ్జ్ ఉండేలా వైసీపీ నేతలు చూసుకుంటున్నారు.
అదే బలం….
ఇక వైసీపీ మేయర్ అభ్యర్ధిగా బరిలో ఉన్న వంశీక్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ తూర్పు నియోజకవర్గం కావడంతో ఆయన పట్టుని అక్కడ నిరూపించుకుంటారని అంటున్నారు. భీమిలీలో ఎటూ మంత్రి అవంతి శ్రీనివాస్ కాపుకాస్తారు. గాజువాకలో కూడా వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి బలంగా ఉన్నారు. పెందుర్తి, అనకాపల్లిలలో యువ ఎమ్మెల్యేలు వైసీపీ తరఫున చక్రం తిప్పుతున్నారు. మొత్తానికి చూసుకుంటే క్యాట్ వాక్ గా వైసీపీ విజయం ఉంటుందని ధీమాగా చెబుతున్నారు. అదే సమయంలో పార్టీ పదవులు ఇచ్చినా కూడా టీడీపీలో అంత జోష్ లేకపోవడం కూడా తమకే అడ్వాంటేజ్ అవుతుందని చెబుతున్నారు.