బుచ్చయ్య బాటలో మరో ముగ్గురు… నిజమేనా?
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం టిడిపిలో సంచలనం సృష్టించింది. తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని, తనకు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం [more]
;
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం టిడిపిలో సంచలనం సృష్టించింది. తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని, తనకు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం [more]
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం టిడిపిలో సంచలనం సృష్టించింది. తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని, తనకు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదని ఆయన పెద్ద బాంబే పేల్చారు. పార్టీకి రాజీనామా చేస్తానంటూ బుచ్చయ్య పేల్చిన బాంబుతో ఒక్కసారిగా టీడీపీ వర్గాల్లో పెద్ద కలకలమే రేగింది. టీడీపీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉండడంతో పాటు ఏకంగా ఆరుసార్లు అసెంబ్లీకి వెళ్లిన బుచ్చయ్య నోట ఈ మాట రావడం పార్టీ శ్రేణులకు, అధిష్టానానికి సైతం మింగుడు పడలేదు.
తూర్పులోనూ…..
బుచ్చయ్య వ్యవహారం కాస్త స్లో అయ్యింది అనుకుంటోన్న టైంలోనే మరో ముగ్గురు సీనియర్ నేతలు సైతం పార్టీని వీడడం లేదా.. పార్టీలో బిగ్ బాంబ్ పేల్చేందుకు రెడీగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లోనే అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ముగ్గురు నేతల్లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ. నెహ్రూ టీడీపీ వయా ప్రజారాజ్యం, వైసీపీ టు తిరిగి టీడీపీలోకి వచ్చారు. కాపు వర్గంలో ఆయనకు మంచి పట్టు ఉంది. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురైతే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు వైసీపీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలు అందరూ హాస్పటల్‌కు వెళ్లి మరీ ఆయన్ను పరామర్శించారు.
విజయనగరంలోనూ…..
ఇది సహజంగా జరిగేదే అయినా ఇద్దరు మంత్రులు, జిల్లా కాపు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు చాలా మంది వైసీపీ ప్రముఖులు ఆయన్ను పరామర్శించడంతో చాలా అనుమానాలు వస్తున్నాయి. ఆయన కోలుకున్నాక అసలు విషయాలు బయటకు వస్తాయంటున్నారు. ఇక విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుజయ్ కృష్ణరంగారావుకు టీడీపీలో పూర్తిగా ప్రాధాన్యత తగ్గిపోయింది. మరోవైపు ఆయన సోదరుడు బేబి నాయనకు బొబ్బిలి నియోజకవర్గ పగ్గాలు ఇచ్చేశారు. ఇక మరో మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకే పూర్తిగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సుజయ్ టీడీపీకి పూర్తిగా దూరం కావడంతో పాటు వైసీపీ వైపు చూస్తున్నారంటున్నారు.
రాయపాటి రగడకు రెడీ….
ఇక గుంటూరు జిల్లాకే చెందిన టీడీపీ సీనియర్ నేత, సీనియర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు ఫ్యామిలీని బాబు పూర్తిగా పక్కన పెట్టినట్టే కనిపిస్తోంది. సాంబశివరావు వయస్సు పై బడింది. ఆయన తనయుడు రంగారావుకు సత్తెనపల్లి లేదా పెదకూరపాడు పార్టీ పగ్గాలు ఇవ్వాలని కోరుతున్నా చంద్రబాబు నాన్చుతూ వస్తున్నారు. ఇటీవల రాయపాటి కూడా గరంగరంగా ఉండడంతో జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆయన ఇంటికి వెళ్లి మరీ చర్చలు జరిపారు. కారణం ఏదైనా తన కుమారుడికి ఏదో ఒక సీటు ఇవ్వకపోతే ఆయన కూడా బాంబు పేల్చేందుకు రెడీగా ఉన్నట్టే తెలుస్తోంది.