టీడీపీకి షాక్…బీజేపీలోకి ఆ నేత?
దేశంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. అది మెల్లగా ఉత్తరాంధ్ర జిల్లాల మీద కూడా ప్రభావం చూపిస్తోంది. తరచూ ఉత్తరాంధ్ర టూర్లు వేస్తున్న ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ [more]
దేశంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. అది మెల్లగా ఉత్తరాంధ్ర జిల్లాల మీద కూడా ప్రభావం చూపిస్తోంది. తరచూ ఉత్తరాంధ్ర టూర్లు వేస్తున్న ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ [more]
దేశంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. అది మెల్లగా ఉత్తరాంధ్ర జిల్లాల మీద కూడా ప్రభావం చూపిస్తోంది. తరచూ ఉత్తరాంధ్ర టూర్లు వేస్తున్న ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు కష్టానికి తగిన ఫలితం కూడా దక్కుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ పుట్టిన నాటి నుంచి ఆ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత గద్దె బాబూరావును ఇటీవల బీజేపీలో చేర్చుకున్న బీజేపీ అదే చేత్తో మరో బలమైన సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేత మెడలో కండువా వేయబోతోంది.
బలమైన నేత దూరమే….
టీడీపీలో పడాల అరుణది ప్రత్యేక స్థానం. ఆమె 1995 తరువాత చంద్రబాబు హయాంలో ఒక వెలుగు వెలిగారు. బలమైన తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన పడాల అరుణకు గజపతినగరం నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఆమె అక్కడ నుంచే ఎమ్మెల్యేగా జెండా ఎగరేశారు. ఇక ఆమెను చంద్రబాబు మంత్రిని కూడా చేశారు. అరుణ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణకు దూరపు చుట్టం కూడా. ఇలా పడాల అరుణ అన్ని రకాలుగా ఒక ఫోర్స్ గా విజయనగరం జిల్లాలో ఉన్నారు. అయితే పాత నీరుని చాలా సులువుగా వదిలించేసుకునే చంద్రబాబు గత రెండు ఎన్నికల నుంచి పడాల అరుణకు అన్యాయం చేస్తూ వచ్చారని ఆమె వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దెబ్బకు పడాల్సిందే …..
పడాల అరుణకు గజపతినగరంలో పట్టున్నా కూడా బొబ్బిలి నుంచి కొండపల్లి అప్పలనాయుడు కొడుకుని తెచ్చి బాబు రాజకీయంగా పోటీకి పెట్టారు. దాంతో ఆమె సైడ్ అయ్యారు. ఇపుడు పడాల అరుణ రాజకీయంగా రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. పడాల అరుణ దెబ్బకు ఈసారి టీడీపీ కూసాలు పడాల్సిందేనని ఆమె అభిమానులు అంటున్నారు. ఆమె బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తాజాగా అందుతున్న సమాచారం. ఆమె తన అనుచరులు, అభిమానులతో కలసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. టీడీపీలో జూనియర్లను తెచ్చి అరుణకు కనీసం పార్టీ పదవి కూడా ఇవ్వకుండా చంద్రబాబు అవమానం చేశారని అంటున్నారు.
గట్టి మద్దతే మరి :
ఉత్తరాంధ్రలో రాజకీయ,సామాజిక సమీకరణల్లో తూర్పు కాపులది అగ్ర తాంబూలమే. ఇప్పటికే టీడీపీ, వైసీపీల నుంచి ఆ వర్గీయులు దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. ఇపుడు పడాల అరుణ బీజేపీలో చేరిత బలమైన నాయకత్వం సామాజికవర్గం అండ ఆ పార్టీకి కూడా లభించినట్లేనని అంటున్నారు. విజయనగరం జిల్లా బీజేపీ రాజకీయాల్లో అది మేలి మలుపు అవుతుందని కూడా చెబుతున్నారు. మంచి రోజు చూసుకుని బీజేపీ తీర్థం తీసుకోవాలని పడాల అరుణ డిసైడ్ కావడం అంటే అది సైకిల్ కి పంక్చర్ వేసినట్లేనని అంటున్నారు.