కాడి కిందపడేసిన పల్లా ?
తెలుగుదేశం పార్టీని విశాఖ జిల్లాలో నడిపించే నాధుడు లేకుండా పోయాడు అన్న బాధ కార్యకర్తలది. విశాఖ అంటే ఒకనాడు టీడీపీకి కంచుకోట లాంటిది. 2019 ఎన్నికల్లో వైసీపీ [more]
;
తెలుగుదేశం పార్టీని విశాఖ జిల్లాలో నడిపించే నాధుడు లేకుండా పోయాడు అన్న బాధ కార్యకర్తలది. విశాఖ అంటే ఒకనాడు టీడీపీకి కంచుకోట లాంటిది. 2019 ఎన్నికల్లో వైసీపీ [more]
తెలుగుదేశం పార్టీని విశాఖ జిల్లాలో నడిపించే నాధుడు లేకుండా పోయాడు అన్న బాధ కార్యకర్తలది. విశాఖ అంటే ఒకనాడు టీడీపీకి కంచుకోట లాంటిది. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి రాష్ట్రం మొత్తం వీచింది. ఇక విశాఖ రూరల్ సహా ఏజెన్సీ మొత్తం వైసీపీ ఏకపక్షంగా విజయాలను దక్కించుకున్నా కూడా సిటీలో మాత్రం ఎంటర్ కానీయకుండా కాపు కాచిన ఘనత క్యాడర్ దే. విశాఖలోని నాలుగు దిక్కులా టీడీపీ ఎమ్మెల్యేలే గెలిచారు. అయితే రెండేళ్లలో సీన్ మొత్తం మారిపోయింది. ఇక సిటీకి అన్నీ తానే వ్యవహరించి టీడీపీ బాధ్యతలు సమర్ధంగా చూసే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తప్పుకున్నారు. ఆయన వైసీపీలోకి వెళ్ళి ఇప్పటికి ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
పార్టీ పదవి ఇచ్చినా?
దాంతో గాజువాకలో ఓడిన పల్లా శ్రీనివాసరావుని తెచ్చి పార్టీ ప్రెసిడెంట్ గా చేశారు చంద్రబాబు. ఆయన ఎంపిక మీదనే టీడీపీలో అసంతృప్తి ఉంది. విశాఖ వైసీపీలో యాదవ సామాజిక వర్గాన్ని టార్గెట్‌గా చేసుకుని పదవులు ఇస్తోంది. కీలక పదవుల్లో యాదవ వర్గాన్ని కూర్చోపెడుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ పదవుల్లోనూ యాదవులకు ప్రయార్టీ ఇస్తామని చెప్పుకునేందుకే ఆ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావుకు ఈ పదవి కట్టబెట్టారు. అయితే ఆయన బలమైన విశాఖ టీడీపీ నేతలను ఎంత వరకు నడిపిస్తారో ? ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదు. ఓడిన వారి కంటే గెలిచిన ఎమ్మెల్యేలలో ఒకరికి పదవి ఇవ్వవచ్చు కదా అన్న చర్చ కూడా అప్పట్లో నడిచింది.
కార్యాలయానికి కూడా…?
ఇక సిటీలో టీడీపీ ఆఫీస్ ఉంటే పల్లా శ్రీనివాసరావు పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు. దాంతో సిటీ నడిబొడ్డున వందల కోట్లతో నిర్మించిన పార్టీ ఆఫీస్ వెలవెలబోతోంది. గతంలో వాసుపల్లి ఉన్నపుడు ప్రతీ రోజూ పార్టీ ఆఫీస్ కి వచ్చేవారు. కార్యకర్తలతో ముచ్చటించేవారు. మంచీ చెడ్డా చూసేవారు. మరో మాజీ ఎమ్మెల్యే రెహ్మాన్ సైతం నగర పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు పార్టీని తన వంతుగా ముందుకు నడిపించే వారు. అయితే ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు మాత్రం ఆ ఇద్దరితో పోలీస్తే జీరో స్థాయి పెర్పామెన్స్ చేస్తున్నారన్న విమర్శలు సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తున్నాయి. వాసుపల్లి, రెహ్మాన్ అయితే అధికార పార్టీకి వ్యతిరేకంగా నెలలో కనీసం మూడు నాలుగు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు.
గాజువాక దాటి…?
పల్లా శ్రీనివాసరావు మాత్రం గాజువాక దాటి అసలు కదలరు అన్న విమర్శలు ఉన్నాయి. అంతే కాదు ఉద్యమాలు లేవు, నిరసనలు అన్న ఊసు లేదు. మరో వైపు చూస్తే విశాఖ సిటీలో పార్టీకి సరైన డైరెక్షన్ ఇచ్చే వారు కూడా కనిపించడంలేదు. విశాఖలో ఉన్న పార్టీ నాయకులు గాజువాక వెళ్ళి ఆయన్ని కలసిరావడం అంటే అది కష్టమైన వ్యవహారమే. మరో వైపు ఆర్ధికంగా కూడా పార్టీని ఆదుకునే సీన్ కూడా లేదు. దీంతో పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో టీడీపీ విశాఖలో ఏమైనా ఎదుగుతోందా, లేక ఇంకా తగ్గిపోతోందా అన్న చర్చ అయితే సొంత పార్టీలో ఉంది మరి. చూడాలి హై కమాండ్ దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి.