పుట్టపర్తిలో పల్లె వారసుడు షైన్ అవుతారా..?
పల్లె రఘునాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. దశాబ్దాల కాలం నుంచి టీడీపీలో కీలకంగా పని చేస్తున్న పల్లె…1999 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ తరుపున అనంతపురం [more]
;
పల్లె రఘునాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. దశాబ్దాల కాలం నుంచి టీడీపీలో కీలకంగా పని చేస్తున్న పల్లె…1999 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ తరుపున అనంతపురం [more]
పల్లె రఘునాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. దశాబ్దాల కాలం నుంచి టీడీపీలో కీలకంగా పని చేస్తున్న పల్లె…1999 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ తరుపున అనంతపురం జిల్లాలోని నల్లమడ నుంచి ( రద్దయ్యింది) ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇక 2009, 2014 ఎన్నికల్లో పుట్టపర్తి నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అయితే మధ్యలో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పల్లె రఘునాథ్ రెడ్డి పదవి పోయింది. ఆ తర్వాత బాబు ఆయనకు విప్ పదవి ఇచ్చి గౌరవించారు.
ఓటమి తర్వాత….?
ఇక 2019 ఎన్నికల్లో పల్లె పుట్టపర్తి నుంచి పోటీ చేసి పల్లె రఘునాథ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. పల్లె ఓటమి ఒక ఎత్తు అయితే ఆయన చరత్రలోనే లేనంత ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయాక పల్లె అంత దూకుడుగా రాజకీయాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. వయసు మీద పడటంతో యాక్టివ్‌గా తిరగడం లేదు. ఆయన భార్య ఆకస్మిక మరణం తర్వాత పల్లె రఘునాథ్ రెడ్డి రాజకీయాలపై అంత ఆసక్తిగా ఉన్నట్టు లేరు. ఈ గ్యాప్‌లోనే అదే జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు పుట్టపర్తిపై కన్నేసేందుకు కొత్త రాజకీయం చేస్తూ వచ్చారు.
వారసుడిని….?
అయితే పల్లె రఘునాథ్ రెడ్డి వీటిన్నింటికి తన వారసుడితో చెక్ పెట్టేస్తున్నారు. పల్లె వారసుడు కృష్ణకిషోర్ రెడ్డి నియోజకవర్గంలో పార్టీ తరుపున యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పుట్టపర్తి బరిలో తనయుడుని నిలబెట్టాలని పల్లె రఘునాథ్ రెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై పార్టీ కేడర్లోనే అసంతృప్తి ఉంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పుట్టపర్తిలో టీడీపీ, వైసీపీకి గట్టి పోటీనే ఇచ్చింది. అటు మున్సిపాలిటీలో కూడా వైసీపీకి పోటీ ఇచ్చింది.
పెద్దగా అడ్డంకులు…?
రెండేళ్లలోనే వైసీపీ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత పెరగడం పల్లె రఘునాథ్ రెడ్డి ఫ్యామిలీకి కలిసిరానుంది. ఇటు టీడీపీ కేడర్‌తో పాటు లోకేష్ సైతం అక్కడ టీడీపీని స్ట్రాంగ్ చేయాలంటే కృష్ణకిషోర్ అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారు. పల్లె సైతం వచ్చే ఎన్నికల్లో తాను సైడ్ అయ్యి, తనయుడుకు టికెట్ ఇప్పించుకోవాలని పల్లె చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీలో వారసుల హంగామా ఎక్కువుగా ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పల్లె వారసుడి ఎంట్రీకి పెద్దగా అడ్డంకులు లేకపోవచ్చు..!