సమయం లేదు కాటమరాయా….!!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇక హైదరాబాద్ ను వదిలిపెట్టి అమరావతి కేంద్రంగా రాజకీయాల్లో బలంగా ఎదగాలని నిర్ణయించారు. పార్టీ నేతలందరినీ అమరావతికి [more]
;
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇక హైదరాబాద్ ను వదిలిపెట్టి అమరావతి కేంద్రంగా రాజకీయాల్లో బలంగా ఎదగాలని నిర్ణయించారు. పార్టీ నేతలందరినీ అమరావతికి [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇక హైదరాబాద్ ను వదిలిపెట్టి అమరావతి కేంద్రంగా రాజకీయాల్లో బలంగా ఎదగాలని నిర్ణయించారు. పార్టీ నేతలందరినీ అమరావతికి మకాం మార్చేయాలని ఆదేశించారు. తాను కూడా కొత్త ఏడాది నుంచి అమరావతి లోనే పూర్తి కాలం ఉండేలా పవన్ ప్లాన్ చేసుకుంటున్నారు. రానున్న ఐదు నెలలు ఇక హైదరాబాద్ రాకూడదని నిర్ణయించుకున్నారు. ఎన్నికలు ముగిసిపోయేంత వరకూ విస్తృత పర్యటనలు చేయాలని ఆయన నిర్ణయించుకోవడంతో పార్టీ నేతలు, శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి.
అన్ని ఏర్పాట్లు పూర్తి…..
అమరావతిలో ఇప్పటికే పవన్ కల్యాణ్ నివాసం ఏర్పాటుచేసుకున్నారు. పార్టీ కార్యాలయాన్ని కూడా సిద్ధం చేశారు. నిత్యం పార్టీ నేతలకు, శ్రేణులకు అందుబాటులో ఉండటానికే అమరావతిలోనే ఇక మకాం ఉండేలా పవన్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలలు మాత్రమే సమయం ఉంది. పార్టీని క్షేత్రస్థాయిలో ఇంకా బలోపేతం చేయలేదు. పవన్ సీపీఎం, సీపీఐ, లోక్ సత్తా పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్న యోచనలో ఉన్నారు. పొత్తుల చర్చలు, సీట్ల కేటాయింపు వంటి అంశాలుఇంకా చర్చించాల్సి ఉంది. తనకు కేటాయించిన గ్లాసు గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సి ఉంది.
కూటమి ఏర్పాటు….
ప్రజాపోరాట యాత్రలు ఏపీలో పవన్ కల్యాణ్ చేస్తున్నప్పటికీ ఆశించిన రీతిలో విస్తృతంగా జరగలేదు. మధ్యలో బ్రేక్ లే ఎక్కువయ్యాయి. దీంతో ఆయన అమరావతిని కేంద్రంగా చేసుకుని ఐదు నెలలపాటు ఏపీలోనే ఉండేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. పొత్తుల్లో భాగంగా సుమారు యాభై సీట్లు ఇతర పార్టీలకు కేటాయించినా దాదాపు 125 స్థానాల్లో తాను పోటీ చేయాల్సి ఉంది. అందుకోసం అభ్యర్థుల కసరత్తు జరగాల్సి ఉంది. తన పరోక్షంలో ఇటీవల అభ్యర్థుల ఎంపికపై కొందరు జనసేన నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా పవన్ ను అమరావతివైపు నడిపించాయంటున్నారు.
జిల్లాల పర్యటనలు….
ఇప్పటివరకూ పవన్ ఐదు జిల్లాల్లో మాత్రమే పర్యటనలు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాల్లో మాత్రమే అక్కడకక్కడా పోరాట యాత్రలను నిర్వహించారు. పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలను, నియోజకవర్గాలను చుట్టిరావాలంటే సమయం సరిపోదు. కింగ్ మేకర్ అవ్వాలనుకుంటున్న పవన్ కల్యాణ్ కనీసం ముప్ఫయి నుంచి నలభై నియోజకవర్గాల్లో విజయం సాధిస్తేనే ఆయన ఆకాంక్ష నెరవేరుతుంది. అందుకోసమే పవన్ పూర్తి స్థాయిలో ఇక పార్టీకే సమయం కేటాయించాలన్న నిర్ణయానికి వచ్చారు. సో…న్యూ ఇయర్ నిజంగా జనసైనికులకు పండగేనని చెప్పాలి.