శుభం కార్డు వేసేస్తారా ఏంది?
పవన్ కల్యాణ్ లో ఎందుకంత నిరాసక్తత? ఆయన పార్టీని నడిపించలేకపోతున్నారా? అందుకే కార్యక్రమాలను తగ్గించుకున్నారా? ఇప్పుడు జనసేన వర్గాల్లో ఇదే చర్చ జరుగుతుంది. పవన్ కల్యాణ్ పార్టీ [more]
;
పవన్ కల్యాణ్ లో ఎందుకంత నిరాసక్తత? ఆయన పార్టీని నడిపించలేకపోతున్నారా? అందుకే కార్యక్రమాలను తగ్గించుకున్నారా? ఇప్పుడు జనసేన వర్గాల్లో ఇదే చర్చ జరుగుతుంది. పవన్ కల్యాణ్ పార్టీ [more]
పవన్ కల్యాణ్ లో ఎందుకంత నిరాసక్తత? ఆయన పార్టీని నడిపించలేకపోతున్నారా? అందుకే కార్యక్రమాలను తగ్గించుకున్నారా? ఇప్పుడు జనసేన వర్గాల్లో ఇదే చర్చ జరుగుతుంది. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన నాటి నుంచి మార్పు కోసమేనని చెబుతూ వస్తున్నారు. 2014 కు ముందు పార్టీ పెట్టినా ఆ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారు. టీడీపీ విజయం సాధించడంతో తన వల్లనే గెలుపు సాధ్యమయిందని పవన్ కల్యాణ‌్ భావించి ఉండవచ్చు.
పూర్తి స్థాయి పొలిటీషియన్ గా….
ఇక 2014 నుంచి 2019 వరకూ కూడా పార్టీని నడిపేందుకు దాదాపు పూర్తి స్థాయి పొలిటీషియన్ గానే పనిచేశారు. సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై ఉద్యమించారు. అక్కడకు వెళ్లి స్వయంగా ప్రజలతో మమేకం అయ్యారు. టీడీపీ ప్రభుత్వం పవన్ పర్యటనకు స్పందించి కొంత సానుకూల ప్రకటన చేసింది.
డెడ్ లైన్ లు కూడా విధించి…
ఆ తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి డెడ్ లైన్ లు కూడా విధించారు. 2019 ఎన్నికల్లో దారుణ ఓటమితో పవన్ కల్యాణ్ తేరుకోలేకపోయారు. ప్రజల నాడిని తాము గుర్తించలేకపోయామని భావించారు. ఓటమి నుంచి తేరుకుని తొలినాళ్లలో కొంత వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలనుకున్నారు. అమరావతి రాజధాని తరలింపును వ్యతిరేకించారు. ఇసుక పాలసీపై గళం విప్పారు. ఆ తర్వాత మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.
పార్టీ కోసమే సినిమాల్లోకి రీ ఎంట్రీ….
కానీ ఇటీవల పవన్ కల్యాణ‌్ పార్టీని నడపటం అంత సాధ్యం కాదని వ్యాఖ్యానించడంపై జనసైనికుల్లో చర్చ జరుగుతోంది. నిజానికి పార్టీ కోసమే పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తున్నారు. పార్టీ కోసమే తాను సినిమాల్లో మళ్లీ నటిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దాదాపు ఐదారు సినిమాలను ఒప్పుకున్నారు. మళ్లీ ఏమైందో ఏమో…. పవన్ కల్యాణ్ లో రాజకీయ వైరాగ్యం వచ్చినట్లుంది. ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుని యాక్టివిటీకి పవన్ కల్యాణ‌్ దూరమయ్యారు. రానున్న కాలంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.