Bjp : పవన్ ను అంటున్నా పెదవి విప్పడం లేదే?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. మంత్రులు నుంచి సినీ నటుల వరకూ పవన్ కల్యాణ్ ను [more]
;
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. మంత్రులు నుంచి సినీ నటుల వరకూ పవన్ కల్యాణ్ ను [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. మంత్రులు నుంచి సినీ నటుల వరకూ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానే వీటిని చేస్తున్నప్పటికీ భాగస్వామి పార్టీ నుంచి ఎటువంటి మద్దతు పవన్ కల్యాణ్ కు లభించలేదు. అసలు బీజేపీ ఈవిషయంలో జోక్యం చేసుకోకూడదన్న భావనతో ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఆన్ లైన్ విషయంలో….
పవన్ కల్యాణ్ సినిమా టిక్కెట్ల ధరలను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడాన్ని తప్పుపడు తున్నారు. ఆన్ లైన్ విధానంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారని ఆయన చెబుతున్నారు. అయితే దీనిపై భాగస్వామ్య పార్టీగా ఉన్న బీజేపీ ఏమాత్రం స్పందించలేదు. సినిమా టిక్కెట్ల విషయంలో బీజేపీ వైఖరి ఏంటో ఇంతవరకూ చెప్పలేదు. బీజేపీ నేతలందరూ ఈ విషయంలో మౌనంగానే ఉండటంతో ప్రభుత్వానికే మద్దతు అని చెప్పకనే చెబుతున్నారనిపిస్తోంది.
పవన్ పై విమర్శలు చేస్తున్నా….
ఇక తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు పెద్దయెత్తున వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో దూషణలకు దిగుతున్నారు. రాజకీయంగా ఇరువైపుల చేసుకునే వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే బీజేపీ ఈ విషయంలోనూ మౌనంగానే ఉంది. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మినహా ఎవరూ పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఈ అంశంపై మాట్లాడలేదు.
పొత్తు ఉన్నట్లా? లేనట్లా?
ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీ పొత్తు ఉంది. అయితే కొంత కాలంగా రెండు పార్టీలూ ఎవరి దారి వారేనని చెబుతున్నాయి. పరిషత్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. జనసేన సయితం సొంతంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టింది. ఈనేపథ్యంలో రెండు పార్టీలకు మధ్య గ్యాప్ బాగా పెరిగిందన్న టాక్ రాజకీయ వర్గాల్లో విన్పిస్తుంది. ఒక వేళ బద్వేలులో కలసి పోటీ చేసినా అది పైకి మాత్రమేని, లోపల మాత్రం ఒకరిపై ఒకరు పలు అంశాల్లో వ్యతిరేకించుకుంటున్నారు.