Tdp : టీడీపీలో పవన్ ను వెనకేసుకొచ్చేది ఆ కులం వాళ్లేనా?

ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ బాగానే వేడి పుట్టించారు. ప్రభుత్వంపై మాటల దాడికి దిగి రాజకీయాలను తన వైపునకు తిప్పుకున్నారు. ప్రభుత్వం తరుపున కూడా అంతే స్థాయిలో [more]

;

Update: 2021-09-30 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ బాగానే వేడి పుట్టించారు. ప్రభుత్వంపై మాటల దాడికి దిగి రాజకీయాలను తన వైపునకు తిప్పుకున్నారు. ప్రభుత్వం తరుపున కూడా అంతే స్థాయిలో రివర్స్ అటాక్ జరిగింది. అంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడు టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ కు అండగా నిలిచే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కమ్మ సామాజికవర్గం నేతలు కాకుండా ఇతర సామాజికవర్గం నేతలు పవన్ కల్యాణ్ ను వెనకేసుకు వస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

పోసాని వ్యాఖ్యలపై….

పవన్ కల్యాణ్ పై మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు ఎవరూ పెద్దగా రియాక్ట్ కాలేదు. సినీనటుడు పోసాని కృష్ణమురళి చేసిన కామెంట్స్ సెగ పుట్టించాయి. పవన్ పై పోసాని వ్యక్తిగత దాడికి దిగడం, ఈ వివాదంలోకి కుటుంబ సభ్యులను, మహిళలను లాగడం తో కాపు సామాజికవర్గం కూడా రియాక్ట్ అయింది. బీజేపీ ఏదో స్పందించామనట్లు స్పందించి ఈ ఎపిసోడ్ ను వదిలేసింది. పెద్దగా దీనిని బీజేపీ లాగలేదు.

కమ్మ సామాజికవర్గం నేతలు….

పోసాని కృష్ణమురళి కమ్మ సామాజికవర్గం నేత. అయినా ఆయన మాత్రం తనకు జగన్ అంటే అభిమానమని చెబుతారు. కానీ పోసాని కామెంట్స పై టీడీపీ నుంచి చంద్రబాబు కాని లోకేష్ కాని రియాక్ట్ కాలేదు. పోనీ వాళ్లు ఈ విషయంలో రియాక్ట్ కాకపోవడం కూడా సబబే. అదే సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. పవన్ కల్యాణ్ పై పోసాని చేసిన విమర్శలను ఆయన ఖండించారు. జగన్ దీనిని ఎందుకు ఖండించరని ఆయన ప్రశ్నించారు.

ఇతర సామాజికవర్గం నేతలే….

ఇక మరోనేత బండారు సత్యనారాయణమూర్తి కూడా పవన్ ను వెనకేసుకొచ్చారు. రాజకీయాల్లోకి ఎన్టీఆర్, పవన్ లు ఆదర్శం కోసం తప్ప ఆదాయం కోసం రాలేదన్నారు. పవన్ పై పోసాని వ్యాఖ్యల వెనక జగన్ ఉన్నారన్నారు. పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగడమేంటని ప్రశ్నించారు. ఇక్కడ కూడా టీడీపీ నేతలు పాత స్ట్రాటజీనే వాడినట్లుంది. పవన్ కల్యాణ్ ను కనీసం గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వారు కూడా మద్దతు తెలపలేదు. ఒక్క కమ్మ సామాజికవర్గం టీడీపీ నేత కూడా స్పందించకపోవడం జనసేనలోనూ చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News