పాక్ లో పవన్ హైలెట్ అవుతున్నారా…?

పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాకిస్తాన్ మీడియాలో హైలెట్ అవుతున్నారు. నిన్న పాక్ పార్లమెంటులో అక్కడి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ… భారత్ లో ఎన్నికల ముందు ఏదో [more]

;

Update: 2019-03-01 10:12 GMT
పవన్ కల్యాణ్
  • whatsapp icon

పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాకిస్తాన్ మీడియాలో హైలెట్ అవుతున్నారు. నిన్న పాక్ పార్లమెంటులో అక్కడి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ… భారత్ లో ఎన్నికల ముందు ఏదో జరుగుతుంది అని తెలుసు అంటూ ఎన్నికల కోసం భారత ప్రభుత్వమే ఉద్రిక్త పరిస్థితులు తీసుకువచ్చింది అనే ఉద్దేశ్యంతో మాట్లాడారు. సరే, పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ అలా మాట్లాడటంతో వింతేమీ లేదు. కానీ, ఇటువంటి వ్యాఖ్యలే ఇమ్రాన్ ఖాన్ కు ముందే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేశారు. కడప జిల్లా పర్యటనలో పవన్ మాట్లాడుతూ… ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని తనకు రెండేళ్ల ముందే చెప్పారు. దీనికి బట్టి మన దేశం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవాలని అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి పవన్ చేసిన ఈ వ్యాఖ్యలను మన మీడియా వెంటనే గుర్తించలేదు.

‘డాన్’ మీడియాలో కథనం

కానీ, నేషనల్ హెరాల్డ్ లో పవన్ వ్యాఖ్యలను ప్రచురితం చేశారు. ‘ఎన్నికలకు ముందు యుద్ధం వస్తుందని రెండేళ్ల కిందే బీజేపీ వాళ్లు చెప్పారని పవన్ అన్నట్లు’ ఓ వార్త రాశారు. వాస్తవానికి పవన్ కామెంట్స్ నిజమే కాని తనకు చెప్పింది బీజేపీ వారు అని పవన్ అనలేదు. ఆయనకు ఎవరు చెప్పారో పవన్ బయటపెట్టలేదు. అయితే, పాకిస్తాన్ లోని ప్రముఖ మీడియా సంస్థ ‘డాన్’ పవన్ కామెంట్స్ పై నేషనల్ హెరాల్డ్ లో వచ్చిన వార్తను బేస్ చేసుకొని ఓ వార్త రాసింది. అంటే, భారత ప్రభుత్వం కావాలనే, ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఈ విధంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొడుతుంది అనేది పాఠకులకు చెప్పేలా ఆ కథనం ఉంది. ‘డాన్’లో వచ్చాక పాక్ కు, వారి వాదనకు తగ్గట్లుగా పవన్ కామెంట్స్ ఉండటంతో దొరికిందే అవకాశం అన్నట్లుగా పవన్ కామెంట్స్ ను హైలెట్ చేస్తున్నాయి. పాక్ పౌరులు కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ వ్యాఖ్యలను బాగా వైరల్ చేస్తున్నాయి.

పవన్ వ్యాఖ్యలను కోట్ చేసిన బాబు

నరేంద్ర మోదీపై, బీజేపీపై రాజకీయ వైరం ఉంటే రాజకీయంగా చూసుకోవాలి కానీ శత్రుదేశ వాదనకు బలం చేకూర్చేలా మన నేతలు మాట్లాడటం ఏంటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక, పవన్ కామెంట్స్ ను బేస్ చేసుకొని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని పవన్ అన్నారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ ఎంతటి దుర్మార్గ రాజకీయాలు చేస్తుందో పవన్ వ్యాఖ్యలే నిదర్శనమని చంద్రబాబు అన్నారు. అంతకుముందు పుల్వా ఘటన జరిగినప్పుడు కూడా ‘పాకిస్తాన్ కు సంబంధం లేదని ఇమ్రాన్ ఖాన్’ అంటున్నారు కదా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చినట్లుగా చంద్రబాబు మాట్లాడటంతో నేషనల్ మీడియాలో బాబు వ్యాఖ్యలను బాగా హైలెట్ చేశాయి. ఇక, ఇప్పుడు పవన్ వ్యాఖ్యలనైతే ఏకంగా పాకిస్తాన్ మీడియానే హైలెట్ చేస్తోంది. అయితే, చెప్పాలనుకుంది సరిగ్గా చెప్పలేకపోయారో లేదా బీజేపీని విమర్శించడంలో నోరు జారారో కానీ చంద్రబాబు, పవన్ ఇద్దరూ కొంత ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కున్నారు.

Tags:    

Similar News