ఈ కాంబో ఫోటో ఇప్పట్లో లేదా ?

పాపం పవన్ కళ్యాణ్ అనే అనాలి. లేకపోతే ఏడేళ్ళ క్రితం మోడీ కంటే పవన్ కే బీజేపీలో వాల్యూ ఎక్కువ ఇచ్చేవారు. అప్పటికి మోడీ గుజరాత్ సీఎం [more]

Update: 2021-02-25 15:30 GMT

పాపం పవన్ కళ్యాణ్ అనే అనాలి. లేకపోతే ఏడేళ్ళ క్రితం మోడీ కంటే పవన్ కే బీజేపీలో వాల్యూ ఎక్కువ ఇచ్చేవారు. అప్పటికి మోడీ గుజరాత్ సీఎం మాత్రమే. పవన్ వెండి తెరపైన చెలరేగిపోయే సంచలన నటుడు. మోడీ ప్రధాని అభ్యర్ధి అనగానే బీజేపీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఏకంగా గుజరాత్ వెళ్ళి మోడీతో భేటీ వేశారు. ఆ రిసీవింగే అదుర్స్ అన్నట్లుగా సాగింది. ఆ తరువాత ఏపీలో అనేక సభల్లో మోడీ పక్కన ఉంటూ ఆయనతో ముచ్చట్లు పంచుకుంటూ పవన్ కళ్యాణ్ సరిసమానంగా కనిపించారు. సీన్ కట్ చేస్తే పవన్ ఎక్కడో తేలారు, మోడీ మాత్రం అందరాని చందమామే అయిపోయారు.

ఏం తక్కువని …?

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు అపాయింట్ మెంట్ ఇచ్చి చాలా సేపు మాట్లాడిన మోడీ తనకు ఏపీలో ఆక్సిజన్ లాంటి మిత్రపక్షం నేత, గ్లామర్ ఉన్న సినీ నటుడు పవన్ కళ్యాణ్ కి మాత్రం మాట్లాడేందుకు టైం ఇవ్వడానికి సరిపోలేదు అంటే ఎవరైనా నమ్మగలరా. రాజు గారి కంటే పవన్ ఏం తక్కువ అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ ఓడితే ఓడవచ్చు కానీ ఆయన ఇప్పటికీ ఏపీలో అతి పెద్ద క్రౌడ్ పుల్లర్. పైసా ఖర్చు పెట్టకుండా వేలాది మంది జనాలను క్షణాలలో సభా స్థలికి రప్పించే సత్తా ఉన్న వాడు. పైగా బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత. మరి అతన్ని మోడీ పట్టించుకోకపోవడం ఏంటి అన్న చర్చ అయితే వస్తోంది.

తప్పు చేశారా …?

పవన్ కళ్యాణ్ బీజేపీకి మిత్రుడిగా కంటే బయట ఉండి ఉంటే మోడీ దగ్గర వాల్యూ పెరిగేది అన్న మాట కూడా ఉంది. పవన్ ఆదికి ముందే పొత్తు పెట్టుకుని తనను తాను తగ్గించుకున్నారని కూడా అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో సరైన వ్యూహం లేకుండా పోటీ చేసి ఓడడం వల్ల కూడా రాజకీయంగా ఈ రకంగా మూల్యం చెల్లిస్తున్నారు అన్న విశ్లేషణ కూడా ఉంది. ఇక పవన్ మీద బీజేపీ పెద్దలకు ఒక రకమైన ఆగ్రహం ఏమైనా ఉందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయట. తాము కోరి మరీ అడిగిన‌పుడు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోకుండా ఏపీలో బీజేపీని నోటా కంటే తక్కువ అయ్యేలా చేశారని కూడా ఆ పార్టీ పెద్దలకు కొంతవరకూ మంట ఉంటే ఉండొచ్చు అని అంటున్నారు.

అదే ధీమానా..?

పవన్ కళ్యాణ్ ఇపుడు ఎటూ పోలేరు. మళ్లీ చంద్రబాబుతో కలిస్తే ఆయన పొలిటికల్ క్రెడిబిలిటీ దారుణంగా దెబ్బతింటుంది. ఈ ఏడేళ్ల కాలంలో ఆరు పార్టీలతో దోస్తీ కట్టిన పవన్ కళ్యాణ్ కనుక బీజేపీకి తలాక్ అంటే ఆయన పరపతి ఇంకా జనాల్లో తగ్గిపోతుంది అన్న అంచనాలతోనే కాషాయం పెద్దలు ఉన్నారా. అలా అయితే ఆయనకు బీజేపీ తప్ప నో ఆప్షన్ అని ధీమా పడుతున్నారా. ఇక పవన్ కి రాజకీయ చతురత కూడా పెద్దగా లేదని అందుకే తామే దిక్కు అన్న ఆలోచనలతోనే లైట్ గా తీసుకుంటున్నారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయట. మొత్తానికి ఒకనాడు ప్రధాని అభ్యర్ధి మోడీతో కలసి ఫోటోలకు ఫోజు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇపుడు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా పెద్దాయన పలకరించకపోవడమే అసలైన పాలిట్రిక్స్. మళ్లీ ఈ కాంబో ఫోటో లేటెస్ట్ గా బయటకు వచ్చే చాన్స్ ఉందా. ఏమో.. చెప్పలేరేమో.

Tags:    

Similar News