Pawan kalyan : ఒక్క ముక్క కూడా చెప్పలేదే? ముంచేయాలనేనా?

బద్వేలు ఉప ఎన్నిక ప్రచారం గడువు ముగుస్తుంది. మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే ఇప్పటి వరకూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ [more]

Update: 2021-10-22 03:30 GMT

బద్వేలు ఉప ఎన్నిక ప్రచారం గడువు ముగుస్తుంది. మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే ఇప్పటి వరకూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించలేదు. ఆయన ప్రచారానికి వస్తారన్న నమ్మకం కూడా లేదు. బీజేపీ నేతలు బద్వేలు ఉప ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తో ప్రచారం చేయించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారు.

ప్రచారానికి గడువు….

ప్రచారానికి గడువు ముగియనుండటంతో ఈ ఐదారు రోజుల్లో పవన్ కల్యాణ‌్ బద్వేలు వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. బద్వేలు ఉప ఎన్నికల విషయంలోనే రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చింది. తొలుత బద్వేలు ఉప ఎన్నికపై సోము వీర్రాజు, పవన్ కల్యాణ్ కూర్చుని చర్చించారు. చర్చల్లో కూడా జనసేన పోటీ చేయాలని అనుకుంటుందని చెప్పారు. అయితే మరుసటి రోజు రాత్రికే అనంతపురంలో తాము బద్వేలులో పోటీ చేయడం లేదని పవన్ కల్యాణ్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చారు.

ఎలాంటి ప్రకటన….

మిత్రపక్షమైన బీజేపీ కూడా తక్కువ తినలేదు. పవన్ కల్యాణ్ తాము పోటీ చేయడం లేదని చెప్పిన వెంటనే తాము బరిలోకి దిగుతామని ప్రకటించింది. అయితే పవన్ కల్యాణ‌్ బద్వేలు ఉప ఎన్నిక ప్రచారానికి వస్తారని, బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తారని సోము వీర్రాజు తెలిపారు. కానీ ఇంతవరకూ పవన్ కల్యాణ‌్ ప్రచారం సంగతి అలా ఉంచి బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఉప ఎన్నిక తర్వాత….

పవన్ కల్యాణ్ మొన్న టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగినప్పుడు వీడియో సందేశం ద్వారా ఖండించారు. బద్వేలులో బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఎలాంటి సందేశం పవన్ ఇవ్వలేదు. ఆ పార్టీ రాజకీయ వ్యవహరాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ మాత్రం తాము బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కనీసం వీడియో సందేశాన్ని అయినా ఇవ్వాలని బీజేపీ నేతలు పవన్ ను కోరుతున్నట్లు తెలిసింది. మొత్తం మీద బద్వేలు ఉప ఎన్నిక తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయ ఆలోచనల్లో మార్పు వచ్చేటట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News