షర్మిలకు పవన్ నేర్పించినట్లుందే?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం పెట్టారు. కానీ ఆయన ప్రత్యక్షంగా పోటీ చేయడానికి ఎంతకాలం పట్టిందనేది అందరికి తెలిసిందే. మనం గెలవడం కోసం కాదు [more]

;

Update: 2021-07-18 13:30 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం పెట్టారు. కానీ ఆయన ప్రత్యక్షంగా పోటీ చేయడానికి ఎంతకాలం పట్టిందనేది అందరికి తెలిసిందే. మనం గెలవడం కోసం కాదు శత్రువు ను దెబ్బ తీయడానికే మన రాజకీయం. ఈ ఫార్ములా కు ఒక కొత్త ట్రెండ్ సృష్ట్టించింది పవన్ కళ్యాణ్ అనే చెప్పొచ్చు. వైసీపీ ఓటమి నే ప్రధాన లక్ష్యంగా చేసుకుని 2014 ఎన్నికలను నడిపారు పవన్. ఆయన పోటీ చేయలేదు కేవలం బిజెపి, టిడిపి లకు మద్దత్తు ప్రకటించి ప్రచారం చేశారు. ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాక ఏ పదవిని కోరుకోలేదు. అయితే 2019 లో నేరుగా పలు పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రణక్షేత్రం లో చతికిల పడ్డారు. అప్పుడు వైసీపీ ఓటమినే టార్గెట్ చేసుకుని పవన్ రాజకీయం చేశారు. కానీ ఫలితాలు రివర్స్ కొట్టాయి. అయితే గత ఎన్నికలు పవన్ బలం ఎంత ఉన్నదన్నది తేల్చింది.

ఆ రూట్ లోనే …

తెలంగాణ లో వైఎస్ షర్మిల పార్టీ పెట్టారు. వైఎస్ తనయ గా ఉన్న బ్రాండ్ తో ఇప్పుడు అక్కడ ఏటికి ఎదురీదెందుకు సిద్ధం అయ్యారు ఆమె. పార్టీ కూడా తన తండ్రి పుట్టిన రోజున ప్రకటించారు. కట్ చేస్తే త్వరలో హుజురాబాద్ ఉప ఎన్నిక సిద్ధంగా కళ్ళముందు ఉంది. ఆ ఎన్నికల్లో బిజెపి వెర్సెస్ టీఆర్ఎస్ అన్నది అందరికి క్లారిటీ ఉంది. కాంగ్రెస్ కు ఏ స్థానం వస్తుందో ఇప్పుడే చెప్పలేం. దాంతో షర్మిల వ్యూహాత్మకంగా వెనుకడుగు వేశారు.

ఎన్నికలు ఎందుకంటూ…?

అసలు అక్కడ ఎన్నికలు ఎందుకో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించి కొత్త చర్చకు తెరతీశారు. తమ పార్టీ పోటీలో ఉండదని క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే సాధారణ ఎన్నికలే తమ లక్ష్యంగా షర్మిల పార్టీ నిర్మాణం కానిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికలకు పరిస్థితిని బట్టి ఆమె నేరుగా అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడతారా లేక బలమైన పక్షానికి మద్దతు ఇచ్చి పొత్తుతో పోటీ చేస్తారా అన్నది తేలనుంది. ఆ నిర్ణయానికి టిఎస్ వైసిపి రావడానికి ఇంకా చాలాకాలం ఆగలిసిఉంది. వైఎస్ షర్మిల కూడా సేమ్ పవన్ కల్యాణ్ రూట్ లోనే పయనిస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News