pawan kalyan : సైడ్ చేసేశారుగా?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు పార్టీల చుట్టూనే తిరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీలు మాత్రమే జనంలో కన్పిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ప్రజల్లో ప్రత్యామ్నాయం [more]
;
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు పార్టీల చుట్టూనే తిరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీలు మాత్రమే జనంలో కన్పిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ప్రజల్లో ప్రత్యామ్నాయం [more]
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు పార్టీల చుట్టూనే తిరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీలు మాత్రమే జనంలో కన్పిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ప్రజల్లో ప్రత్యామ్నాయం అనిపించుకోవాలి. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ మాత్రం అందులో సక్సెస్ కాలేకపోయారు. చంద్రబాబు పార్టీ టీడీపీ తీవ్రంగా దెబ్బతిన్న సమయంలోనూ పవన్ కల్యాణ‌్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేయడం లేదు.
ఉద్యమ కార్యాచరణ ఏదీ?
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి రాజకీయ పార్టీలు తమ ఉద్యమ కార్యాచరణను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకునే ప్రయత్నం చేస్తుంది. ఉద్యమాలను చేస్తుంది. వైసీపీకి ప్రత్యామ్నాయం తామేనని ప్రజల్లోకి వెళుతుంది. అందులో టీడీపీ సక్సెస్ అయిందనే చెప్పాలి. కానీ జనసేన, బీజేపీలు మాత్రం వైసీపీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకోవడంలో విఫలమయ్యారు.
ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయంలో…
ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. రెండున్నరేళ్లు ఇట్టే గడచిపోతాయి. ఈలోగా కీలకమైన కొన్ని సామాజికవర్గం ఓటు బ్యాంకులను కూడా టీడీపీ కైవసం చేసుకునే అవకాశముంది. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో రాజకీయంగా చలనం లేకపోవడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు ఛార్జీలపై జనం మండిపడుతున్నారు. చెత్త పన్ను, ఆస్తిపన్నుల విషయంలో అభ్యంతరం తెలుపుతున్నారు.
నిరాసక్తత నష్టం తెస్తుందా?
ఇలాంటి ప్రజా సమస్యలపై ఉద్యమించాల్సిన సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలకే పరిమితం కావడం ఆ పార్టీ శ్రేణులను నిరాశలోకి నెట్టిందనే చెప్పాలి. ఎన్నికల సమయానికి వస్తే తనకంటూ ఓటు బ్యాంకు లేకుండా చేసుకుంటూ పవన్ కల్యాణ్ రాంగ్ స్ట్రాటజీలో వెళుతున్నారని జనసేన పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ‌్ నిరాసక్తత రాజకీయంగా నష్టం చేకూర్చే అవకాశాలున్నాయి.