Pawan kalyan : అసహనంతో అనుకున్నది చేసేస్తారేమో?

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎవరూ ఊహించని నిర్ణయాలు ఉండవచ్చు. పవన్ కల్యాణ‌్ జనసేన పార్టీ పెట్టి తెలుగుదేశానికి మద్దతు పలుకుతారని ఎవరైనా ఊహించారా? ప్రత్యేక [more]

Update: 2021-09-27 15:30 GMT

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎవరూ ఊహించని నిర్ణయాలు ఉండవచ్చు. పవన్ కల్యాణ‌్ జనసేన పార్టీ పెట్టి తెలుగుదేశానికి మద్దతు పలుకుతారని ఎవరైనా ఊహించారా? ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ అగ్రనేతలపై ఎదురు దాడి చేసి అదే నేతలతో కలసి పయనిస్తాడని అనుకున్నామా? ఈ రెండూ ఊహించనవే. కానీ మరో రాజకీయ పరిణామానికి కూడా త్వరలో విశాఖపట్నం వేదికగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు.

విసుగు చెంది…..

పవన్ కల్యాణ్ బీజేపీ వ్యవహార శైలి పట్ల విసుగు చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఆయనలో అసహనం పెంచాయి. పెట్రోలు ధరల పెంపుదల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకూ నిర్ణయాలన్నీ ప్రజా వ్యతిరేకమైనవే. కేంద్ర ప్రభుత్వం మాత్రం మొండి పట్టుదలతో పోతుంది. జనసేనకు కొద్దోగొప్పో పట్టున్న ప్రాంతాలు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు మాత్రమే. బీజేపీతో పొత్తు కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో తమను ప్రజలు మరోసారి దూరం పెడతారన్న ఆందోళన పవన్ కల్యాణ్ లో ఉంది.

స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో….

అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటారని తెలిసింది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించ వద్దంటూ కేంద్ర పెద్దలను ఢిల్లీకి వెళ్లి పవన్ కల్యాణ‌్ కలసి వచ్చారు. కానీ తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పనులను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దీంతో పవన్ కల్యాణ్ కూడా పునరాలోచనలో పడ్డారని తెలిసింది. ప్రజా వ్యతిరేక చర్యలతో పార్టీ మరింత ఇబ్బంది పడుతుందని భావించిన పవన్ కల్యాణ్ విశాఖ కేంద్రంగా సీరియస్ డెసిషన్ తీసుకుంటారని చెబుతున్నారు.

ఆ పర్యటనలోనేనా….?

పవన్ కల్యాణ్ విశాఖ పట్నానికి వచ్చే నెలలో రానున్నారు. ఈ పర్యటనలో ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను కూడా కలుస్తారు. వారి పోరాటానికి సంఘీభావాన్ని ప్రకటిస్తారు. ఇదే సమయంలో ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పుడిప్పుడే జనసేన నేతలు కూడా టీడీపీ తో పొత్తు పెట్టుకోవాలని కోరుతున్నారు. అనేక చోట టీడీపీ, జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుతో వెళ్లింది. దీంతో పవన్ కల్యాణ్ నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Tags:    

Similar News