Janasena : ఆ సీట్లలో గెలిస్తే చాలట.. సర్వే ప్రకారమే అభ్యర్థులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కీలకంగా మారాలనుకుంటున్నారు. 2025 వరకూ తనకు అధికారం అక్కరలేదని పైకి చెప్పినా పార్టీని అప్పటి వరకూ నడపటం [more]

;

Update: 2021-10-28 06:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కీలకంగా మారాలనుకుంటున్నారు. 2025 వరకూ తనకు అధికారం అక్కరలేదని పైకి చెప్పినా పార్టీని అప్పటి వరకూ నడపటం అంత సులువు కాదు. పార్టీని ఆర్థిక ఇబ్బందుల నుంచే గట్టెక్కించలేకనే ఆయన వరస సినిమాలకు ఒప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఫెయిల్యూర్ ముద్ర పడితే ఇక పార్టీని ఎవరూ విశ్వసించరని పవన్ కల్యాణ్ సయితం అభిప్రాయపడుతున్నారు.

కీలక నియోజకవర్గాలను….

అందుకే కీలకమైన నియోజకవర్గాలను గుర్తించి అక్కడ గట్టిగా పనిచేయాలని పవన్ కల్యాణ‌్ భావిస్తున్నారు. అభిమానుల పరంగా, సామాజికపరంగా చూసుకంటే పవన్ కల్యాణ‌్ కు ఉత్తరాంధ్రతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పట్టుంది. ఇక్కడ ఓటు బ్యాంకు కూడా అధికంగానే ఉంది. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతాల్లోనే జనసేన కొన్ని సీట్లు గెలుచుకోగలిగింది. ఇక సీమ, కోస్తాంధ్రల్లో జనసేన బలహీనంగానే ఉందని చెప్పాలి.

అభ్యర్థుల ఎంపిక….

అయితే తమకు పట్టున్న ప్రాంతాల్లో గెలవగలిగిన నియోజకవర్గాలు, అక్కడ అభ్యర్థుల ఎంపికను కూడా ప్రతిష్టాత్మకమే. కనీసం నలభై నుంచి యాభై స్థానాల్లో ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ముంబయికి చెందిన ఒక సంస్థతో సర్వే చేయాలని పవన్ కల్యాణ‌్ నిర్ణయించారు. ఎన్నికలకు ఏడాది ముందు ఈ సర్వే చేస్తే సరైన ఫలితం వస్తుందని భావిస్తున్నారు. జనసేన ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారాలంటే కనీసం నలభై స్థానాల్లో గెలవాలన్నది పవన్ కల్యాణ్ లక్ష్యంగా కన్పిస్తుంది.

వైసీపీ సిట్టింగ్ స్థానాలే…

ఈ స్థానాలు కూడా అన్నీ వైసీపీ సిట్టింగ్ స్థానాలే అయి ఉంటాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాల్లోనే గెలిచింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెద్దగా టీడీపీకి దక్కలేదు. దీంతో వైసీపీ సిట్టింగ్ స్థానాలనే పవన్ కల్యాణ‌్ టార్గెట్ గా పెట్టుకున్నారంటున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ అన్న జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ బాధ్యతను కూడా సర్వే సంస్థకు అప్పగించాలని డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ‌్ అధికారంలోకి వచ్చే సంగతి పక్కన పెట్టి కీలకంగా మారాలన్న దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.

Tags:    

Similar News