Pawan kalyan : సైకిల్ సవారీకి సిద్ధమయినట్లేనా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీతో ఉన్నారు. జనసేన సర్వసభ్య సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు సంకేతాలుగా చెప్పాలి. అవసరమైతే తాను వ్యూహం [more]

;

Update: 2021-09-30 02:00 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీతో ఉన్నారు. జనసేన సర్వసభ్య సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు సంకేతాలుగా చెప్పాలి. అవసరమైతే తాను వ్యూహం మార్చుకుంటానని పవన్ కల్యాణ్ చెప్పడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేన అధినేత ఆలోచనలు సైకిల్ పార్టీ వైపు చూస్తున్నట్లుగానే ఉంది. ఇప్పటికే జనసేన, టీడీపీ పొత్తుపై ప్రచారం జరుగుతోంది.

అధికారంలోకి రావాలంటే?

పవన్ కల్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తుతో కొనసాగుతున్నారు. అయితే రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం అన్నది జరిగే పని కాదు. జగన్ పార్టీని ఎదుర్కొనాలంటే వ్యూహం మార్చాల్సిందేనని ఆయన గట్టిగా అభిప్రాయపడుతున్నారు. అది టీడీపీతో పొత్తుతోనే సాధ్యమని పవన్ కల్యాణ్ గట్టిగా విశ్వసిస్తున్నట్లు కన్పిస్తుంది. తాను టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం ఖాయమన్న ధీమాలో ఉన్నారు.

కమ్మ సామాజికవర్గంపై….

అందుకే విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కమ్మ సామాజికవర్గం గురించి ప్రస్తావించినట్లు విశ్లేషణలు వినపడుతున్నాయి. వైసీపీ నేతలు కమ్మవారిపై కక్ష కట్టారని, కాశ్మీర్ పండిట్లను తరిమేసినట్లు ఒక జాతిని రాష్ట్రానికి దూరం చేయాలనుకుంటున్నారన్నారు. వారికి అండగా నిలబడతామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. అయితే ఇక్కడ పవన్ కల్యాణ్ కు ఒక చిక్కుంది అంటున్నారు.

కాపులు అండగా నిలబడతారా?

కాపు సామాజికవర్గం సహజంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ముద్రగడ పద్మనాభం పై వ్యవహరించిన తీరు, టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసులను వారు ఇప్పటికీ గుర్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తుతో దిగితే కాపు సామాజికవర్గం ఆయనకు అండగా నిలబడొచ్చు కాని, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కలసి రాకపోవచ్చు అన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. మొత్తం మీద పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు వింటే టీడీపీతో పొత్తు ఖాయంగానే కన్పిస్తుంది.

Tags:    

Similar News