Badvel : రాజీ పడే ప్రసక్తి లేదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి రాజీపడేందుకు సిద్ధంగా లేరు. బద్వేలు ఉప ఎన్నికలలో జనసేన నుంచి అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఇప్పటికే బీజేపీతో పొత్తుతో [more]

Update: 2021-10-01 05:00 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి రాజీపడేందుకు సిద్ధంగా లేరు. బద్వేలు ఉప ఎన్నికలలో జనసేన నుంచి అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఇప్పటికే బీజేపీతో పొత్తుతో జనసేన క్యాడర్ లో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. తిరుపతి ఉప ఎన్నికల సమయంలోనూ జనసేన క్యాడర్ నుంచి వత్తిడి ఎదురయింది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికను బీజేపీకే వదిలేయాల్సి వచ్చింది.

తిరుపతిలో తగ్గడానికి…

నిజానికి తిరుపతిలో జనసేన బలం ఎక్కువగా ఉంది. తిరుపతి, శ్రీకాళహస్తి వంటి నియోజకవర్గాల్లో బలిజ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో అప్పట్లో జనసేన నుంచి పోటీ చేయాలని పవన్ కల్యాణ‌్ కూడా భావించారు. తిరుపతి లో జరిగిన కార్యకర్తల సమావేశంలో క్యాడర్ కు కూడా హామీ ఇచ్చారు. కానీ పార్లమెంటు ఎన్నిక కావడంతో కేంద్ర నాయకత్వం జోక్యంతో దానిని బీజేపీకే వదిలేయాల్సి వచ్చింది.

బీజేపీకి వదలబోం…

ఇక ఇప్పుడు బద్వేలు ఉప ఎన్నికను కూడా బీజేపీకే వదిలేస్తే క్యాడర్ లో తప్పుడు సంకేతాలు వెళతాయని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అందుకే రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని తెలిసింది. బద్వేలులో మాత్రం జనసేన అభ్యర్థి బరిలో ఉంటారని, ఇందులో వెనక్కు తగ్గడం ఏమీ ఉండదని ఆయన బీజేపీ నేతలకు చెప్పినట్లు సమాచారం. బీజేపీ నేతలు కూడా తాము కేంద్ర నాయకత్వంతో చర్చించి చెబుతామని వెళ్లినా, వారు కూడా జనసేనకే వదిలేస్తే బెటరన్న ధోరణిలో ఉన్నారు.

ప్రచారం పై కూడా….

బద్వేలులో గెలుపోటములు పక్కన పెడితే సీమ ప్రాంతంలో పార్టీ క్యాడర్ లో తిరిగి జోష్ నింపేందుకు ఈ ఉప ఎన్నిక ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పవన్ కల్యాణ‌్ ప్రచారాలను కూడా నిర్వహించాలని నిర్ణయించారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ రోడ్ షోలు కాకుండా ప్రతి మండలంలో మినీ సభలను ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ‌్ ఇప్పటికే అక్కడి నేతలను ఆదేశించినట్లు తెలిసింది. మొత్తం మీద బద్వేలు విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని పవన్ కల్యాణ్ అక్కడి నేతలకు కూడా స్పష్టం చేసినట్లు తెలసింది.

Tags:    

Similar News