Pawan : పవన్ ను వాళ్లే పొలిటికల్ హీరోను చేస్తున్నారా?
పవన్ కల్యాణ్ సీజన్ పొలిటీషయన్. ఆయన రాజకీయాలను గత ఏడేళ్ల నుంచి ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. మార్పు కోసం వచ్చానన్న పవన్ జనంలోకి వెళ్లేందుకు మాత్రం [more]
;
పవన్ కల్యాణ్ సీజన్ పొలిటీషయన్. ఆయన రాజకీయాలను గత ఏడేళ్ల నుంచి ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. మార్పు కోసం వచ్చానన్న పవన్ జనంలోకి వెళ్లేందుకు మాత్రం [more]
పవన్ కల్యాణ్ సీజన్ పొలిటీషయన్. ఆయన రాజకీయాలను గత ఏడేళ్ల నుంచి ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. మార్పు కోసం వచ్చానన్న పవన్ జనంలోకి వెళ్లేందుకు మాత్రం పెద్దగా సాహసించరు. అది అందరికీ తెలిసిందే. కానీ వైసీపీయే పవన్ కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్లు కన్పిస్తుంది. పవన్ కల్యాణ‌్ ను చూసీ చూడనట్లు వదిలేస్తే వైసీపీకి కలిగే డ్యామేజీ కంటే ఆయనకు ఇచ్చే ప్రయారిటీ ఇప్పుడు ఆయన ఇమేజ్ ను మరింత పెంచేలా కన్పిస్తుంది.
రెెండు గంటలే…
నిజానికి పవన్ కల్యాణ్ రాజమండ్రిలో శ్రమదానం కార్యక్రమంలో పవన్ కల్యాణ్ కేవలం రెండు, మూడు గంటలు మాత్రమే పాల్గొంటారు. ఆయన శ్రమదానంలో పాల్గొని బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత ఆయన అనంతపురం జిల్లా పుట్టపర్తికి వెళతారు. కేవలం రెండు, మూడు గంటలు మాత్రమే రాజమండ్రిలో ఉండే పవన్ కల్యాణ్ కు ఇప్పడు పోలీసులు లేనిపోని హైప్ ఇచ్చారంటున్నారు.
సీరియస్ గా తీసుకోని నేతను…
పవన్ కల్యాణ్ కామెంట్స్ ను ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోరు. ఆయన శ్రమదానం చేసి రోడ్లు వేస్తామన్నా ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం పవన్ కల్యాణ్ కు లేనిపోని ప్రచారం కల్పించింది. కాటన్ బరాజ్ పై శ్రమదానానికి అనుమతివ్వకపోవడం వరకూ కరెక్టే. అయితే మరో చోటకు వేదిక మార్చుకున్నా అక్కడ కూడా పోలీసులు సభకు నిరాకరించడం, జనసేన కార్యకర్తలు శ్రమదానంలో పాల్గొనవద్దని నోటీసులు ఇవ్వడం కూడా ఆయనకు అనుకూలించే అంశాలే.
ప్రయారిటీ ఇచ్చి…..
పవన్ కల్యాణ‌్ ను చూసీ చూడనట్లు వదిలస్తే ఆయన వచ్చి కాసేపు రోడ్లపై గుంతలు పూడ్చి వెళ్లేవారు. కానీ ప్రభుత్వమే పవన్ కల్యాణ్ కు ప్రయారిటీ ఇచ్చినట్లయింది. గత రెండేళ్ల నుంచి పవన్ కల్యాణ్ సినిమాలు చేసుకుంటున్నారు. పార్టీని పూర్తిగా వదిలేశారు. జనం కూడా ఆయనను లైట్ గానే తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పవన్ కల్యాణ్ అనవసరంగా రాజకీయాల్లో హీరోను చేస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.