Pawan : బరిలోకి దిగితే బలయిపోతామేమో?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది జనసేన అని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జనసేన బీజేపీతో కలసి [more]

;

Update: 2021-10-02 08:00 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది జనసేన అని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జనసేన బీజేపీతో కలసి బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతుందా? లేదా? అన్నది సందేహంగా మారింది. జనసేన బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్దగా సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికల్లోనూ బీజేపీనే బరిలోకి దింపాలన్న యోచనలో ఉంది.

బద్వేలు ఉప ఎన్నికపై….

ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ బద్వేలు గురించి పెద్దగా చర్చించలేదని సమాచారం. ఆయన బద్వేలు ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా జనసైనికులు తాము పోటీ చేస్తామని ముందుకు వచ్చారు. బీజేపీకి వద్దంటూ తీర్మానాలు కూడా చేశారు. దీంతో పవన్ కల్యాణ్ సమావేశాన్ని ఏర్పాటు చేసి చివరకు బీజేపీయే పోటీ చేసేలా నిర్ణయించారు. అది పార్లమెంటు ఎన్నిక కాబట్టి ఇచ్చామని క్యాడర్ కు సర్ది చెప్పారు.

తొలుత అనుకున్నా….

ఇప్పుడు జరుగుతున్నది బద్వేలు అసెంబ్లీ ఎన్నికే. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని తొలుత భావించినప్పటికీ ఎన్నికలకు ముందు మరో ఓటమిని మూట కట్టుకోవడం ఎందుకని పవన్ కల్యాణ్ సందేహిస్తున్నారు. బద్వేలులో పెద్దగా జనసేనకు బలం లేదు. పైగా అధికార పార్టీ సిట్టింగ్ సీటు అది. దీంతో పాటు టీడీపీ కూడా అక్కడ బలంగా ఉంది. అక్కడ పోటీ చేసి దారుణంగా ఓడి క్యాడర్ లో నిరాశ కలిగించడం ఎందుకున్న ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారు.

ఉన్న ఇమేజ్ పోతుందని…

ఇటీవలే పరిషత్ ఎన్నికలు పార్టీలో కొంత ఊపుతెచ్చాయి. దానిని కోల్పోయేలా ఇప్పుడు బద్వేలులో పోటీ చేయడం తెలివైన నిర్ణయం కాదని సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకే బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి పవన్ కల్యాణ‌్ విముఖత చూపుతున్నారని తెలిసింది. బీజేపీతో చర్చల పేరిట నిర్ణయాన్ని వాయిదా వేసినా ఫైనల్ గా ఆయన తేల్చేదేంటంటే బద్వేలు ఉప ఎన్నికకు జనసేనను దూరంగా ఉంచడమే.

Tags:    

Similar News