Pawan kalyan : పొలికేకలు పెట్టి… పక్కకు తప్పుకుంటే?

అనుకున్నట్లే జరిగింది. పవన్ కల్యాణ్ బద్వేలులో పోటీకి దింపరనే అనుకున్నాం. ఆ విధంగానే పవన్ కల్యాణ్ నిర్ణయించారు. బద్వేలు ఉప ఎన్నిక ఈ నెల 30వ తేదీన [more]

Update: 2021-10-03 03:30 GMT

అనుకున్నట్లే జరిగింది. పవన్ కల్యాణ్ బద్వేలులో పోటీకి దింపరనే అనుకున్నాం. ఆ విధంగానే పవన్ కల్యాణ్ నిర్ణయించారు. బద్వేలు ఉప ఎన్నిక ఈ నెల 30వ తేదీన జరిగింది. రెండు రోజుల నుంచి ప్రభుత్వంపై పొలికేకలు పెట్టిన పవన్ కల్యాణ్ పోలింగ్ దగ్గరకు వచ్చేసరికి వెనక్కు తగ్గారు. పవన్ కల్యాణ్ ఇటీవల మాట్లాడిన తారు ఆయన ఎఫెన్స్ లోనే ఇక రాజకీయం చేస్తారనుకున్నారు. కానీ ఉన్నట్లుండి ఎవరూ ఊహించని రీతిలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

పోటీ చేయబోవడం లేదని….

పవన్ కల్యాణ‌్ తాము బద్వేలు ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని స్పష్టం చేశారు. పోటీ చేయాలని వత్తిడి వచ్చినా విలువల కోసమే పోటీ నుంచి తప్పుకుంటున్నామని చెప్పారు. బద్వేలులో జనసేన పార్టీ తరుపున అభ్యర్థిని నిలబెట్టడం లేదని ఆయన తెలిపారు. అంతేకాదు తాము మృతి చెందిన ఎమ్మెల్యే సతీమణి బరిలో ఉన్నందున సంప్రదాయాన్ని పాటిస్తూ పోటీకి దూరంగా ఉంటామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

రెండు రోజుల నుంచి….

పోటీ నుంచి తప్పుకోవచ్చు. అందులో ఎవరూ ప్రశ్నించరు. కాని రెండు రోజుల నుంచి మాట్లాడిందేమిటి? చూసుకుందాం రా అంటివి. వచ్చే ఎన్నికల్లో వైసీీపీకి 15 సీట్లు కూడా రావంటివి. జనసేనదే అధికారమంటివి. ఇన్ని మాటలు విన్న క్యాడర్ ఏమనుకుంటుంది. కానీ అంత ఎగెరెగిరి చివరకు పోటీ నుంచి తప్పుకుని అభిమానులను నిరాశపర్చారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పోటీ నుంచి పవన్ కల్యాణ్ పార్టీ తప్పుకోవడానికి కొన్ని కారణాలు లేకపోలేదు.

ఆ కారణాలేనా?

అక్కడ జనసేన బలంగా ఉంది. ఎటూ వైసీపీదే గెలుపు. జనసేన అభ్యర్థిని పోటీ చేయించడం అనవసర ఖర్చు అని పవన్ కల్యాణ‌్ భావించి ఉండవచ్చు. ఇక రెండో కారణం తాను పోటీ నుంచి తప్పుకుంటే టీడీపీ, వైసీీపీ స్ట్రయిట్ ఫైట్ అవుతుంది. అప్పుడు ఓట్లు చీలవు. ఈ రెండు కారణాలతోనే పవన్ పోటీ నుంచి తప్పుకున్నారంటున్నారు. ఆ ప్రకటన చేసి తన మిత్రపక్షమైన బీజేపీని కూడా పవన్ కల్యాణ్ ఇరుకున పెట్టారని చెప్పాలి.

Tags:    

Similar News