Pawan kalyan : మనదంతా ఈస్ట్ మన్ కలర్ రాజకీయమేనా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేవలం జగన్ కు మాత్రమే శత్రువుగా కన్పిస్తున్నారు. ఆయన పొత్తుల కోసం పరితపిస్తున్నారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా జగన్ ను లక్ష్యంగా [more]

;

Update: 2021-10-15 13:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేవలం జగన్ కు మాత్రమే శత్రువుగా కన్పిస్తున్నారు. ఆయన పొత్తుల కోసం పరితపిస్తున్నారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా జగన్ ను లక్ష్యంగా చేసుకుని గత కొన్నేళ్లుగా చేస్తున్న రాజకీయాలు కలసి రావడం లేదు. అయినా అదే బాటలో పయనిస్తున్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టిందే రాష్ట్ర విభజన జరిగిందని. అడ్డగోలుగా ఏపీని విభజించారంటూ ఆయన జనసేన పార్టీని స్థాపించారు.

రాష్ట్ర విభజన తర్వాత….

2014 ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ను వ్యతిరేకించారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్న జగన్ ను సమర్థించలేదు. అదే సమయంలో ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాష్ట్ర అభివృద్ధి కోసమంటూ బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతిచ్చారు. దానికి ఎవరూ పెద్దగా తప్పుపట్టలేదు. అయితే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ను పవన్ కల్యాణ్ పూర్తిగా వదిలేశారు. చంద్రబాబు గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా ఆయన వ్యతిరేకించలేదు. పన్నెత్తు మాట అనలేదు.

హోదాపై మాటమార్చిన…

అలాగే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన బీజేపీతో పవన్ కల్యాణ్ అంటకాగుతున్నారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. మార్పు కోసం అంటూ వచ్చిన పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ముఖ్యమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నా పెదవి విప్పడం లేదు. పైగా ప్రత్యేక హోదాపై తన పోరాటం ఆగదని చెప్పుకొస్తూ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇన్ని కలర్సా….?

ఇక 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అవినీతిపై పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. లోకేష్ అవినీతిపరుడంటూ ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కానీ రెండేళ్లు తిరగకముందే అదే పార్టీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ కు పాలిటిక్స్ లో ఒక నిలకడలేదన్న ప్రత్యర్థుల విమర్శలకు ఇవే ఉదాహరణలు. జనం నమ్మాలంటే కొంత నాయకుడిపై విశ్వసనీయత అవసరం. పవన్ కల్యాణ్ రాజకీయం కేవలం రెండేళ్లలోనే అనేక రంగులు మార్చడం ఆయన పార్టీకి మైనస్ కాక మరేమిటి?

Tags:    

Similar News