Janasena : ఇక్కడ పోటీ చేస్తే…ఎవరితో… పొత్తు?

మరో రెండేళ్లలో జరగనున్న తెలంగాణలో పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ సిద్దమవుతున్నారు. ఇందుకోసం కార్యాచరణను సిద్దం చేశారు. బహుశ బీజేపీతో పొత్తుతోనే తెలంగాణలో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. [more]

;

Update: 2021-10-17 09:30 GMT

మరో రెండేళ్లలో జరగనున్న తెలంగాణలో పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ సిద్దమవుతున్నారు. ఇందుకోసం కార్యాచరణను సిద్దం చేశారు. బహుశ బీజేపీతో పొత్తుతోనే తెలంగాణలో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. బీజేపీ తెలంగాణలో బలంగా ఉంది. అధికార పార్టీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చెప్పుకుంటుంది. అంతేకాకుండా గత లోక్ సభ ఎన్నికలలో నాలుగు లోక్ సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. దీంతో 2023లో జరిగే ఎన్నికల్లో బీజేపీ తో కలసి తెలంగాణలో పోటీ చేయాలని నిర్ణయించారు.

నాడు ప్రజారాజ్యం కూడా….

ప్రజారాజ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్థాపించినప్పుడు తెలంగాణలో కేవలం ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. అయితే అప్పుడు పరిస్థితులు వేరు. తెలంగాణలో బలంగా మెగా హీరోల అభిమానులు లక్షల్లో ఉన్నారు. వీరంతా జనసేనకు అండగా నిలబడనున్నారు. దీనికి తోడు బీజేపీ బలం కూడా తోడయితే కనీసం కొన్ని స్థానాల్లో గెలిచేందుకు పవన్ కల్యాణ్ ప్రణాళిక రూపొందించు కుంటున్నారు.

బలం ఉన్న ప్రాంతంలోనే….

తెలంగాణలో తమకు కొంత బలం ఉన్న ప్రాంతాలను గుర్తించి కేవలం పది నుంచి పదిహేను స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని జనసేన భావిస్తుంది. బీజేపీ తో కలసి పోటీ చేస్తు కనీస స్థానాలను దక్కించుకోవచ్చని, తెలంగాణ అసెంబ్లీలో జనసేనకు ప్రాతినిధ్యం దక్కుతుందని భావిస్తున్నారు. ఏపీలో ప్రధానంగా పార్టీపై దృష్టి పెట్టినా అక్కడి కంటే ఏడాది ముందు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో కనీసస్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు.

బీజేపీతోనే కలసి….

ఇక్కడ జనసేన క్యాడర్ కూడా పోటీ చేయాలని బలంగా కోరుకుంటుంది. క్యాడర్ ను నిరాశ పర్చడం ఇష్టంలేక పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను కూడా జనసేన పోటీ చేసే స్థానాల్లో ప్రచారం చేస్తానని కూడా తెలంగాణ నేతలకు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. పార్టీకి ఉపయోగపడేవారు, సేవాభావం కలిగిన వారిని కొందరిని ఎంపిక చేసి వారిని మాత్రమే ఎన్నికల బరిలోకి దింపాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.

Tags:    

Similar News