Pawan kalyan : ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వరట
రాజకీయాల్లో మడి కట్టుకు కూర్చుంటే కుదరదు. తమకు కులాలతో సంబంధం లేదని చెబితే ఎవరూ నమ్మరు. పార్టీ కూడా బలోపేతం కాదు. ఈ విషయం జనసేన అధినేత [more]
;
రాజకీయాల్లో మడి కట్టుకు కూర్చుంటే కుదరదు. తమకు కులాలతో సంబంధం లేదని చెబితే ఎవరూ నమ్మరు. పార్టీ కూడా బలోపేతం కాదు. ఈ విషయం జనసేన అధినేత [more]
రాజకీయాల్లో మడి కట్టుకు కూర్చుంటే కుదరదు. తమకు కులాలతో సంబంధం లేదని చెబితే ఎవరూ నమ్మరు. పార్టీ కూడా బలోపేతం కాదు. ఈ విషయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అర్థమయినట్లుంది. అందుకే కాపు సామాజికవర్గాన్ని మరింత ఓన్ చేసుకునేందుకు ఆయన ప్రణాళికను రూపొందించారని తెలుస్తోంది. కాపులతో జిల్లాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేయడానికి పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారంటున్నారు.
కాపులను ఏకం చేసేందుకు….
ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజికవర్గం బలంగా ఉంది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి వంటి కులాలు సంఘటితం కాలవడం లేదు. అందుకే కాపులు రాజకీయాల్లో కీలకంగా మారలేకపోతున్నారు. తమ డిమాండ్లను కూడా నెరవేర్చుకోలేకపోతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ను ఎదుర్కొనాలంటే కాపులను ఏకం చేయాలి. వారికి అండగా తాను ఉన్నానని నమ్మించగలగాలి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.
జిల్లాల వారీగా సమావేశాలు….
కాపు రిజర్వేషన్లతో పాటు మరికొన్ని సమస్యలను ఆయన జిల్లాల వారీగా సమావేశాలను నిర్వహించి వారితో మమేకం కావాలని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ ను ఇప్పటికే కాపులు తమ నేతగా గుర్తిస్తున్నారు. అయితే జనసేన అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేకపోవడంతో గత ఎన్నికల్లో వారు వైసీపీ వైపు మొగ్గు చూపారు. కానీ ఈసారి పవన్ కల్యాణ్ ఆ ఛాన్స్ ఇవ్వదలచుకోలేదు. సంఘటితంగా ఉండి రాజ్యాధికారమే లక్ష్యంగా వెళ్లాలన్నది ఆయన నిర్ణయంగా ఉంది.
మహాసభకు ప్లాన్…..
ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి కాపులతో పవన్ కల్యాణ్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు. కాపులు తన వెనక ఉన్నారన్న బలమైన సంకేతాలను ఇస్తే రాజకీయంగా పొత్తులు ఉన్నా పార్టీకి లాభం జరుగుతుందని అంచనాలో ఉన్నారు. సమావేశాలు పూర్తయిన తర్వాత కాపులతో రాష్ట్ర వ్యాప్త మహాసభను కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య నేతృత్వంలో ఇందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.