Janasena : ఉండవల్లి దారి చూపినట్లుందిగా?
జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. ఏపీలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలన్న తపన జనసేనలో [more]
;
జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. ఏపీలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలన్న తపన జనసేనలో [more]
జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. ఏపీలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలన్న తపన జనసేనలో కన్పిస్తుంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీని ప్రజలు విశ్వసించకపోతుండటంతో తానే లీడ్ రోల్ తీసుకోవాలని నిర్ణయించినట్లుంది. అందుకే పవన్ కల్యాణ‌్ ఇటీవల అటు సినిమాలు చేస్తూనే, ఇటు రాజకీయాలపైన కూడా ఎక్కువ ఫోకస్ పెట్టారు.
ఏపీ ఆర్థిక పరిస్థితిపై….
పవన్ కల్యాణ‌్ ప్రతి రోజూ ట్విట్టర్ లో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి బాగా లేదు. విద్యుత్తు సంక్షోభం కూడా తలెత్తే అవకాశముంది. జగన్ చేతకానితనం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని, ఇలాగే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే భవిష‌్యత్ తరాలు అన్ని రకాలుగా ఇబ్బంది పడతాయని జనసేన జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసింది. దీనికి ఉండవల్లి అరుణ కుమార్ మార్గం చూపించినట్లయింది.
నాలుగుచోట్ల…..
ఇటీవల ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై కుండబద్దలు కొట్టారు. ఆరు లక్షల కోట్లు అప్పులు చేసి ఏం సాధిద్దామనుకున్నారని ప్రశ్నించారు. ఉండవల్లి వ్యాఖ్యల తర్వాత పవన్ కల్యాణ్ లో ఆలోచన మొదలయిందంటున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మేధావులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖపట్నం, అనంతపురం, విజయవాడ, తిరుపతి పట్టణాల్లో ఈ సమావేశాలను నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లు తెలిసింది.
మేధావులతో…..
దసరా పండగ తర్వాత ఈ సమావేశాలను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశాాలకు ఉండవల్లి అరుణ్ కుమార్ ను కూడా ముఖ్యఅతిధిగా ఆహ్వానించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఆర్థిక నిపుణులను ఈ సమావేశాలకు ఆహ్వానించి వారి చేతనే ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల నిర్వాకాన్ని వివరించాలన్నది పవన్ కల్యాణ్ ప్రయత్నంగా కన్పిస్తుంది. అలా కొన్ని వర్గాలకు పవన్ కల్యాణ‌్ దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు.