Pawan kalyan : బయలుదేరుతున్నాడు.. ఇక కాచుకోండి

అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? ప్రజల్లోకి ఎలా వెళ్లాలి? పాదయాత్రగానా? బస్సు యాత్రగానా? లేకుంటే నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలను పెట్టడమా? ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ [more]

Update: 2021-10-29 08:00 GMT

అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? ప్రజల్లోకి ఎలా వెళ్లాలి? పాదయాత్రగానా? బస్సు యాత్రగానా? లేకుంటే నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలను పెట్టడమా? ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందున్న ప్రశ్నలు. జనంలోకి వెళ్లలేకనే గత ఎన్నికల్లో ఘోర పరాభావం ఎదురయిందని పవన్ కల్యాణ్ కు తెలిసొచ్చింది. అయితే ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. చివరి ఏడాదిలో ఏదో ఒక కార్యక్రమంతో ముందుకు వెళ్లాలన్నది పవన్ కల్యాణ్ ప్లాన్.

చివరకు చిరు లాగానే…?

అది ఎలా అన్నదే మొన్నటి దాకా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లోనూ అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయలేకపోయారు. వ్యవధి లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వంటి వాటితో ఆయన ప్రచార సభలను కుదించుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి ఏడాదిన్నర ముందు నుంచే యాత్ర చేయాలని నిర్ణయించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు బస్సు యాత్రను చేపట్టారు. ప్రజల నుంచి మంచి స్పందనే వచ్చింది.

అన్ని నియోజకవర్గాలు…

తాను కూడా అదే రీతిలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు టచ్ అయ్యేలా యాత్ర చేపట్టాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత పాదయాత్ర చేయాలని అనుకున్నా సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని పవన్ కల్యాణ్ అనుమానిస్తున్నారు. అది ఆయనకున్న అభిమానులతో ఇబ్బంది అవుతుంది. అందుకే తన సోదరుడు చిరంజీవిలా బస్సు యాత్ర చేయడమే బెటర్ అని పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారు.

నెలకు రెండు జిల్లాలు….

175 నియోజకవర్గాల్లో పర్యటన ఉండేలా ప్లాన్ చేయాలని పవన్ కల్యాణ్ తన టీంను ఆదేశించినట్లు తెలిసింది. ప్రతి నెల రెండు జిల్లాల చొప్పున ప్లాన్ చేయాలని కూడా ఆయన చెప్పారు. దీంతో పవన్ కల్యాణ్ బస్సుయాత్రకు సిద్ధమవుతున్నట్లే తెలుస్తోంది. బస్సులోనే ఉండి ఎటువంటి వేదికలు లేకుండా ప్రసంగించే వీలుంటుంది. అందుకే బస్సు యాత్రకే పవన్ కల్యాణ్ మొగ్గు చూపారు. సో.. పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికలను చాలా సీిరియస్ గా తీసుకుంటున్నట్లుంది.

Tags:    

Similar News