Pawan kalyan : పవన్ ఆ ప్రాంతానికి గుడ్ బై చెప్పేసినట్లేనట

ఎక్కడైనా పోయిన చోటే వెతుక్కోమన్నారు. కానీ రాజకీయాల్లో అది కొన్నిసార్లు సాధ్యం కాదు. పార్టీల అధినేతలందరికీ ఏదో ఒక శాశ్వత నియోజకవర్గం ఉంది. చంద్రబాబుకు కుప్పం, జగన్ [more]

;

Update: 2021-10-27 12:30 GMT

ఎక్కడైనా పోయిన చోటే వెతుక్కోమన్నారు. కానీ రాజకీయాల్లో అది కొన్నిసార్లు సాధ్యం కాదు. పార్టీల అధినేతలందరికీ ఏదో ఒక శాశ్వత నియోజకవర్గం ఉంది. చంద్రబాబుకు కుప్పం, జగన్ కు పులివెందుల ఉన్నాయి. వారు అక్కడ ప్రచారానికి వెళ్లకుండానే గెలుస్తారు. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాత్రం అటువంటి పక్కా నియోజకవర్గం లేకుండా పోయింది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓటమి పాలయ్యారు.

వచ్చే ఎన్నికల్లో….

ఈసారి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది చర్చగా మారింది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు పవన్ కల్యాణ్ మరోసారి గాజువాక నుంచి పోటీ చేసే అవకాశాలు కన్పించడం లేదు. గాజువాకలో పవన్ పోటీ చేసి టెన్షన్ పడాల్సిన పనిలేదంటున్నారు. గత ఎన్నికల్లోనే చంద్రబాబు లోపాయికారీతనంగా పవన్ కు మద్దతిచ్చారని అక్కడ అధిక సంఖ్యలో ఉన్న సామాజికవర్గం వైసీపీికి అండగా నిలిచింది. అందువల్లనే పవన్ కల్యాణ్ ఓటమి పాలయ్యారు.

సీమ నుంచేనా?

పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రను ఎంచుకున్నారు. కానీ ఈసారి రాయలసీమలో పోటీ చేస్తారంటున్నారు. సీమ ప్రాంతంలోని తిరుపతి నియోజకవర్గం తనకు సేఫ్ ప్లేస్ అని పవన్ కల్యాణ్ నమ్ముతున్నారు. సీమ నుంచి పోటీ చేశామన్న సంకేతాలను పంపవచ్చు. దీంతో జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముగ్గురు సీమ ప్రాంతం నుంచి పోటీ చేసినట్లవుతుందని జనసేన పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.

ఓటమి పాలయిన తర్వాత…?

అందుకే పవన్ కల్యాణ్ గాజువాక వైపు చూడటం లేదు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత పవన్ కల్యాణ‌్ ఇప్పటి వరకూ విశాఖకు రాలేదు. గత నెల 31వ తేదీన ఆయన విశాఖ రానున్నారు. రాజమండ్రి, అనంతపురం వంటి ప్రాంతాలను పర్యటించారు కాని విశాఖకు మాత్రం ఇంతవరకూ ఆయన రాలేదు. 31న విశాఖకు వచ్చినా స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనకు పరిమితమవుతారు. దీంతో గాజువాకకు పవన్ కల్యాణ్ గుడ్ బై చెప్పినట్లేనని తెలుస్తోంది. భీమవరం నుంచి కూడా ఈసారి పవన్ కల్యాణ్ పోటీ చేయరని చెబుతున్నారు.

Tags:    

Similar News