Pawan kalyan : నాలుగు అరుపులు అరవడమేనా? ఏమైనా ఉందా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత విశాఖకు రానున్నారు. 2019 ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ విశాఖకు రాలేదు. విశాఖలోని గాజువాక నియోజకవర్గం నుంచి [more]

Update: 2021-10-31 08:00 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత విశాఖకు రానున్నారు. 2019 ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ విశాఖకు రాలేదు. విశాఖలోని గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయన పవన్ కల్యాణ్ తర్వాత సినిమాల్లో బిజీ అవ్వడంతో రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలే పవన్ తిరిగి తన పొలిటికల్ యాక్టివిటీని ప్రారంభించారు. ఈరోజు విశాఖకు పవన్ కల్యాణ్ వస్తుండటంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

భారీ బహిరంగ సభలో….

పవన్ కల్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనకు మద్దతు ప్రకటించి భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభ ద్వారా పవన్ కల్యాణ్ ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దశల వారీగా ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ముఖ్యంత్రి జగన్ ప్రయివేటీకరణను నిలిపేయాలని ప్రధాని మోదీకి రెండు లేఖలు రాశారు.

బీజేపీతో పొత్తుతో…

పవన్ కల్యాణ్ కూడా గతంలో ఢిల్లీ వెళ్లి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దని విజ్ఞప్తి చేసి వచ్చారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు. ప్రధాని మోదీ విధానాలను పవన్ కల్యాణ్ ప్రశంసిస్తారు. ఇటీవల వంద కోట్ల కరోనా వ్యాక్సిన్ ను భారత్ లో పూర్తి చేసిన సందర్భంగా కూడా పవన్ కల్యాణ్ ప్రశంసించారు. అయితే ఈరోజు ఆయన వస్తున్నది విశాఖ స్టీల్ ప్లాంట్ కు. మొత్తం మోదీ వల్లనే ఈ ప్లాంట్ ప్రయివేటీకరణ జరుగుతున్న అభిప్రాయం ఉంది.

విమర్శలు చేస్తారా?

అటువంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ మోదీ పై విమర్శలు చేయలేరు. అలాగని ఊరుకుంటే కార్మికుల వద్దకు వచ్చి ఏం పొడిచారన్న ప్రశ్నలు ఎదురవుతాయి. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించడం వరకూ ఓకే..కాని పవన్ దీనిపై ఎటువంటి కార్యాచరణ ప్రకటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పొత్తుతో ఉన్న బీజేపీపై యుద్ధం ప్రకటిస్తారా? లేక షరా మూమూలుగా నాలుగు అరుపులు అరచి వెళ్లిపోతారా? అన్నది చూడాల్సి ఉంది. దీనిపై బీజేపీ నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News