పవన్ పై పసుపు నీళ్ళు

తెలుగుదేశం పార్టీ కి బలం ఆ పార్టీకి మద్దతుగా ఏర్పాటు చేసుకున్న మీడియా. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా లే కాదు సోషల్ మీడియా కూడా. ఆ మీడియానే [more]

;

Update: 2019-09-02 03:30 GMT

తెలుగుదేశం పార్టీ కి బలం ఆ పార్టీకి మద్దతుగా ఏర్పాటు చేసుకున్న మీడియా. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా లే కాదు సోషల్ మీడియా కూడా. ఆ మీడియానే వెన్ను దన్ను టిడిపికి. ఇప్పుడు అధికారంలో టిడిపి లేకపోవడంతో ఆ పార్టీ మీడియా కు చేతినిండా పని దొరికింది. అయితే ఈ మీడియా రాజధాని మార్పు, పోలవరం ప్రాజెక్ట్, విద్యుత్ ఒప్పందాల రద్దు అంశాలతో పెద్దఎత్తునే మడ్ పంపింగ్ ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే మొదలుపెట్టేసింది పసుపు మీడియా.

ఇప్పుడు టార్గెట్ బొత్స …

రాజధాని మార్పు అంశం పై మంత్రి బొత్స సత్యనారాయణ తేనే తుట్టె కదిపారు. వెంటనే టిడిపి నుంచి ఇతర పక్షాల నుంచి పెల్లుబికిన ఆగ్రహాన్ని తనదైన శైలిలో తిప్పికొడుతూ వస్తున్నారు బొత్స. స్వయంగా బిజెపి నేత రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తో మొదలు పెట్టిన యుద్ధం తో ఒక్కసారిగా ఆ స్థాయి నాయకులు రాజధానిపై మాట్లాడటానికి వెనుకంజ వేసేపరిస్థితి ఏర్పడింది. దాంతో బొత్స ఇమేజ్ ఒక్కసారిగా వైసిపిలో పెరిగింది. దాంతో టిడిపి మీడియా టార్గెట్ బొత్స గా మారింది. పదేపదే ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కావాలని బొత్స కలగన్నారంటూ వినూత్న రీతిలో ఆయనపై ప్రచారం మొదలు పెట్టింది.

తానా అంటే ….

టిడిపి అనుకూల మీడియా లో ఇలా ఈ ప్రచారం మొదలైన వెంటనే చిత్రంగా జనసేన అధినేత అవే వ్యాఖ్యలను ప్రస్తావించడం చర్చనీయాంశం అయ్యింది. బొత్స అవకాశం వస్తే వైసిపి సర్కార్ కి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందంటూ సేమ్ మైండ్ గేమ్ అమలు చేయడం విశేషం. ఇకపై బొత్స ను సిఎం జగన్ పక్కన పెట్టేందుకే ఇదంతా అని వైసిపి అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో వైసిపి సైతం ఎదురుదాడికి దిగింది. పవన్ కళ్యాణ్ తో టిడిపి చీకటి ఒప్పందం బయటపడిపోయిందంటూ విమర్శలు మొదలు పెట్టేశారు. ఎన్నికల ముందు ఇదే ప్రచారం జనసేన ను దారుణంగా దెబ్బకొట్టింది. తిరిగి ఇలాంటి ఆధారాలతో జనం ముందు పెట్టి జనసేన, టిడిపి అనుబంధం ఇదిగో అంటూ ఫ్యాన్ పార్టీ స్టార్ట్ చేస్తున్న వాదనతో జనసేన డిఫెన్స్ లో పడుతుందా ? అటాకింగ్ మోడీ లోకి వెళుతుందా వేచిచూడాలి.

Tags:    

Similar News