అసెంబ్లీలో బాబు … జనంలో జగన్ … కమిటీల ఏర్పాటులో పవన్

ఏపీలోని మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీల అధినేతలు చాలా బిజీగా వున్నారు. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఎవరి వ్యూహాల్లో వారు తలమునకలౌతున్నారు. టిడిపి అధినేత ముఖ్యమంత్రి [more]

Update: 2019-02-08 03:47 GMT

ఏపీలోని మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీల అధినేతలు చాలా బిజీగా వున్నారు. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఎవరి వ్యూహాల్లో వారు తలమునకలౌతున్నారు. టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో బిజెపి ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఆ తరువాత నియోజక వర్గాల వారీ పంచాయితీలు సర్దుబాటు చేస్తూ గడుపుతున్నారు. ఇక ప్రధాన విపక్షం వైసిపి అధినేత నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఆయన ఎన్నికల శంఖారావం పేరిట సభలు, బూత్ లెవెల్ కార్యకర్తలతో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూ క్షణం ఖాళీ లేకుండా సాగిపోతున్నారు. ఇక జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ జోరు బాగా పెంచారు. పార్టీ నిర్మాణం వేగవంతం చేస్తూ కమిటీలను ప్రకటిస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్.

నోటిఫికేషన్ వచ్చేలోగా …

ఎపి లోని మూడు పార్టీలు ఎన్నికల నోటిఫికేషన్ లు వచ్చేలోగా చేయాలిసిన పనులన్నీ పూర్తి చేయాలని తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. చంద్రబాబు టిడిపి అధినేత అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్న నియోజకవర్గాలపై కుస్తీ పట్లు పడుతున్నారు. అతి వేగంగా పలు నియోజకవర్గాల సమస్యలు పరిష్కరిస్తూ క్యాడర్ ను యుద్ధోన్ముఖుల్ని చేస్తున్నారు. వైసిపి అధినేత గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లు తిరిగి జారకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కునే పనిలో పడ్డారు జగన్. క్షేత్ర స్థాయిలో బలహీనంగా వున్న నియోజకవర్గాలపై పవన్ సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. ముందు రాష్ట్ర కార్యవర్గాలు, ఎన్నికల కమిటీలను ప్రకటించిన పవన్ ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీలు వేస్తున్నారు. కామ్రేడ్ లతో సీట్ల సర్దుబాటుపై కూడా జనసేన కసరత్తు దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పక్షాల వ్యూహం లో ఎవరు అందలం ఎక్కనున్నారో కొద్ది నెలల్లోనే తేలిపోనుంది.

Tags:    

Similar News