పినరయి పీపుల్ లీడరా? కాదా?

కేరళలో పినరయి విజయన్ కు మాత్రమే కాదు మొత్తం సీపీఎం కు ఈ ఎన్నికలు సవాల్ గా మారనున్నాయి. గత ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చిన సీపీఎం [more]

Update: 2020-05-24 17:30 GMT

కేరళలో పినరయి విజయన్ కు మాత్రమే కాదు మొత్తం సీపీఎం కు ఈ ఎన్నికలు సవాల్ గా మారనున్నాయి. గత ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చిన సీపీఎం మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? అన్న ప్రశ్న తలెత్తుంది. దేశ వ్యాప్తంగా సీపీఎంకు ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ మాత్రమే. కేరళలో వచ్చే ఏడాదిలో శాసనభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇటు కాంగ్రెస్, అటు సీపీఎం గట్టిగానే పోరాడుతున్నాయి. బీజేపీ కూడా సత్తా చాటాలన్న ప్రయత్నం చేస్తుంది.

మ్యాజిక్ ఫిగర్ 71 కావడంతో…

కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 71 మాత్రమే. సీపీఎం నేతృత్వంలోని ఎల్.డి.ఎఫ్ ప్రస్తుతం అధికారంలో ఉంది. కేరళలో కాంగ్రెస్ పార్టీకి కూడా పట్టుంది. యూడీఎఫ్ కూటమి పేరుతో ఇది బరిలోకి దిగనుంది. బీజేపీ సొంతంగా పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. గత ఎన్నికలలో అత్యధిక సీట్లను సాధించిన సీపీఎం ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని ప్రయత్నం చేస్తుంది.

ఏదో ఒక దెబ్బ….

కేరళలో గత కొద్దిరోజులుగా ఏదో ఒక వైపరీత్యం పట్టి పీడిస్తూనే ఉంది. వరసగా వరదలు రావడంతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైంది. దైవ భూమిగా పేర్కొనే కేరళకు కరోనా వైరస్ సోకింది. అయితే అన్ని వైపరీత్యాలను పినరయి విజయన్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ ను కూడా కట్టడి చేయడంలో పినరయి విజయన్ విజయం సాధించారు. కేంద్ర ప్రభుత్వం సహాయం అందించకపోయినా తాను మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళుతున్నారు.

నాయకత్వంపై…..

దీంతో పినరయి విజయన్ నాయకత్వంపై ప్రజలకు కూడా నమ్మకం కలిగింది. ఆయన నాయకత్వాన్ని బలపర్చేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా సత్తా చాటాలని భావిస్తుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో అమేధీలో ఓడిపోయిన రాహుల్ గాంధీ పరువు నిలబెట్టింది కేరళ మాత్రమే. ఇక బీజేపీ కూడా హిందుత్వ నినాదంతో ముందుకు వెళుతుంది. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పినరయి విజయన్ సమర్థత, నాయకత్వం పటిమపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారు.

Tags:    

Similar News