టీడీపీ బాబాయ్‌… వైసీపీ అబ్బాయ్‌.. కృష్ణాలో కొత్త రాజ‌కీయం

రాజ‌కీయాల్లో వేర్వేరు పార్టీల్లో ఉన్న వాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవ‌డం కామ‌న్‌. సొంత పార్టీలోనే ఉన్న ప్రత్యర్థుల‌ను ఓడించేందుకు వేరే పార్టీ నాయకుల‌కు స‌పోర్ట్ చేయ‌డం 1999 [more]

Update: 2021-08-08 08:00 GMT

రాజ‌కీయాల్లో వేర్వేరు పార్టీల్లో ఉన్న వాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవ‌డం కామ‌న్‌. సొంత పార్టీలోనే ఉన్న ప్రత్యర్థుల‌ను ఓడించేందుకు వేరే పార్టీ నాయకుల‌కు స‌పోర్ట్ చేయ‌డం 1999 ఎన్నిక‌ల నుంచి బాగా ఎక్కువ అయ్యింది. తెలుగు రాజ‌కీయాల్లో ఈ ట్రెండ్ ఎక్కువ‌. వేరే పార్టీలో ఉన్న ప్రత్యర్థుల‌తో చేతులు క‌ల‌ప‌డం, మిలాఖ‌త్ పాలిటిక్స్ చేయ‌డం అనేది కులాన్ని బ‌ట్టే కాదు.. ర‌క‌ర‌కాల అంశాలు డిసైడ్ చేస్తాయి. ఇలాంటి రాజ‌కీయ‌మే కృష్ణా జిల్లాలో ఓ వైసీపీ మంత్రి, టీడీపీ మాజీ ఎంపీ మ‌ధ్య న‌డుస్తోంద‌న్న టాక్ జిల్లాలో బాగా స్ప్రెడ్ అయ్యింది. ఈ ఇద్దరు నేతల మిలాఖ‌త్ పాలిటిక్స్‌పై ఎప్పటి నుంచో టాక్ ఉన్నా ఇప్పుడు వారు వ్యవ‌హ‌రిస్తోన్న తీరు చూస్తుంటే ఈ బంధం మ‌రింత బ‌ల‌ప‌డిందా ? అన్న సందేహాలు ఉన్నాయి.

రెండున్నర దశాబ్దాలుగా…..

జిల్లా ముఖ్యప‌ట్టణం అయిన బంద‌రు కేంద్రంగా గ‌త రెండున్నర ద‌శాబ్దాలుగా పేర్ని, కొన‌క‌ళ్ల ఫ్యామిలీలు రాజ‌కీయం చేస్తున్నాయి. ముందు నుంచి వీరు వేర్వేరు పార్టీల్లో ఉన్నా ఈ రెండు కుటుంబాల మ‌ధ్య ఉన్న సంబంధాలు వేరు. ముందు నుంచి కూడా పేర్ని ఫ్యామిలీకి కొనక‌ళ్ల ఫ్యామిలీతో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే వీరి అనుచ‌రుల మ‌ధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ వ్యాపారం అంతా పేరుకు మాత్రమే కొన‌క‌ళ్ల, పేర్ని అనుచ‌రుల మ‌ధ్య అని టాక్ ఉన్నా … దాని వెన‌క ఉంది మాత్రం ఈ ఇద్దరు నేత‌లే అంటారు. వీరు బాబాయ్‌, అబ్బాయ్ అని పిలుచుకుంటూ ఉంటార‌న్నది అంద‌రికి తెలిసిన విష‌యమే. 2009 ఎన్నిక‌ల్లో పేర్ని ఎమ్మెల్యేగా, కొన‌క‌ళ్ల ఎంపీగా ఈ అండ‌ర్ స్టాండింగ్‌తోనే గెలిచార‌ని అంటారు.

ఒకరినొకరిపై విమర్శలకు….

పేర్ని నాని చంద్రబాబు, టీడీపీ, లోకేష్‌పై ఎన్ని ఘాటైన విమ‌ర్శలు చేసినా కొన‌క‌ళ్లను మాత్రం అంతే స్ట్రాంగ్‌గా విమ‌ర్శించ‌రు. గ‌తంలో కూడా పేర్ని నానికి కొన‌క‌ళ్ల ఫ్యామిలీ ఎన్నో కీల‌క విష‌యాల్లో సాయం చేశార‌న్న టాక్ ఉంది. త‌ర్వాత పేర్ని కూడా అదే కృత‌జ్ఞత చూపిస్తార‌న్న‌ది బంద‌రు వినిపించే మాట‌. ఇక్కడ పేర్ని నానికి రాజ‌కీయ ప్రత్యర్థిగా టీడీపీకే చెందిన మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఆయ‌న ఓ హ‌త్య కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లడంతో పాటు రాజ‌కీయంగా చాలా ఇబ్బందులు ప‌డ్డారు. అప్పుడు కొల్లును పేర్ని నాని కావాల‌నే టార్గెట్‌గా చేశార‌ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్యక్తం కావ‌డంతో పాటు కొల్లుకు మ‌ద్దతు ల‌భించింది.

సొంత పార్టీ నేతలతో మాత్రం….

ఇక ఇటు కొన‌క‌ళ్ల ఫ్యామిలీ జ‌గ‌న్‌ను, వైసీపీని తిట్టినా పేర్ని నానిపై అంతే దూకుడు చూపించ‌రు. అయితే బంద‌రులో కొన‌క‌ళ్ల వ‌ర్గం నుంచి అంత స‌పోర్ట్ రాలేద‌ని పార్టీ శ్రేణులు చ‌ర్చించుకున్నాయి. ఆ మాట‌కు వ‌స్తే కొన‌క‌ళ్ల ఫ్యామిలీ ఇత‌ర పార్టీలో నేత‌ల‌తో ఎక్కువుగా సంబంధాలు నెర‌పుతూ సొంత పార్టీ వాళ్లనే ప్రత్యర్థులుగా చూస్తుంద‌న్న చ‌ర్చలు కూడా ఉన్నాయి. బంద‌రు ప‌క్కన ఉన్న పెడ‌న‌లో దివంగత సీనియ‌ర్ ఎమ్మెల్యే కాగిత వెంక‌ట్రావుతోనూ వీరికి ఎంత మాత్రం ప‌డేది కాదు. అది బంద‌రులో ఈ ఇద్దరు నేత‌ల రాజ‌కీయం..!

Tags:    

Similar News