సూపర్ మినిస్టర్ అయ్యారుగా
మంత్రి పదవి దక్కడమే ఒక భాగ్యం. అందులోనూ సూపర్ మినిస్టర్ అనిపించుకోవడం మరింత భాగ్యం. ఇప్పడు ఇలాంటి ఘనతనే సాధిస్తున్నారు రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణా జిల్లాలకు [more]
;
మంత్రి పదవి దక్కడమే ఒక భాగ్యం. అందులోనూ సూపర్ మినిస్టర్ అనిపించుకోవడం మరింత భాగ్యం. ఇప్పడు ఇలాంటి ఘనతనే సాధిస్తున్నారు రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణా జిల్లాలకు [more]
మంత్రి పదవి దక్కడమే ఒక భాగ్యం. అందులోనూ సూపర్ మినిస్టర్ అనిపించుకోవడం మరింత భాగ్యం. ఇప్పడు ఇలాంటి ఘనతనే సాధిస్తున్నారు రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన మంత్రుల్లో ఒకరు. ఆయనే పేర్ని నాని. వాస్తవానికి జగన్ కేబినెట్‌లో ఈ రెండు జిల్లాల నుంచి మంత్రులుగా కీలక నేతలకు అవకాశం చిక్కింది. వీరిలో ఒకరు ఫైర్ బ్రాండ్ కూడా ఉన్నారు. వారే వరుసగా మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, పేర్ని వెంకట్రామయ్య ఉరఫ్ పేర్నినాని, కొడాలి శ్రీవేంకటేశ్వరరావు ఉరఫ్ నాని, వెలంపల్లి శ్రీనివాస్. అయితే, వీరిలో అందరూ తమ పని తాము చేసుకుని పోతున్నా.. ఒకరిద్దరు మాత్రమే యాక్టివ్‌గా ఉంటున్నారు.
కౌంటర్ ఇవ్వడంలో….
ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు వివరించడంలోను, ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్న ఆరోపణలకు ఘాటైన జవాబు ఇవ్వడంలోను ముందున్న మంత్రులు ఇద్దరే కనిపిస్తున్నారు. వారే ఒకరు కొడాలి నాని, రెండోవారు పేర్నినాని. కృష్ణాజిల్లా గుడివాడ నుంచి కొడాలి నాని, మచిలీపట్నంనుంచి పేర్ని నాని ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక, ఈ ఇద్దరిలోనూ తరచుగా మీడియాలో కనిపిస్తూ.. ప్రతిపక్షాలను ఎండగడుతూ.. ప్రభుత్వాన్ని బలపరుస్తున్న మంత్రిగా పేర్ని నాని రికార్డు సృష్టిస్తున్నారు.
ఘాటైన పదజాలంతో….
ఏదో పదవి వచ్చింది.. కదా.. అని పేర్ని నాని సరిపెట్టుకోకుండా.. తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తూనే.. ప్రజలతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలపైనా విరుచుకుపడుతున్నారు. దీపావళి పండగ సమయంలో ఆయన మాటల పటాకులు పేలుస్తూ.. విపక్షాలకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా అటు చంద్రబాబు, ఇటు జనసేనాని పవన్ తీరులను ఎండగట్టిన తీరు.. పేర్ని నానికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందేలా చేశాయి.
ముందు వరసలో నిలిచి….
బాబుతో ఎవరు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారో.. అందరికీ తెలిసిందేనని పవన్‌పై పేర్ని నాని నిప్పులు చెరిగారు. అదే సమయంలో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఎండగట్టారు. ఇలా సందర్భానికి అనుకూలంగా ప్రభుత్వ విధానాన్ని సమర్ధిస్తూ.. విపక్షంపై నిప్పులు చెరగడంలో ఈ రెండు జిల్లాలకు చెందిన మంత్రుల్లో పేర్ని నాని ముందు వరుసలో నిలుస్తున్నారు. మిగిలిన వారు కూడా మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నా.. పేర్ని నాని దూకుడే ఎక్కువగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం. ప్రతి వారంలో మూడు నాలుగు సార్లు పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి బాబునో, పవన్‌నో, బీజేపీనో ఏకేస్తున్నారు. అటు జగన్ దగ్గర కూడా పేర్ని నానికి ఈ విషయంలో ఇప్పటికే మంచి మార్కులు పడినట్టు కూడా వైసీపీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.