ఆ నానికి బదులు ఈ నాని ?
జగన్ సర్కార్ కి అన్నీ సవాళ్ళే. అసలు ఆయన ప్రభుత్వమే ఇబ్బందుల్లో ఏర్పడింది. ఆర్ధికంగా లోటు ఉన్న రాష్ట్రం. సరైన ఆర్ధిక వనరులు లేని చోట భిన్న [more]
;
జగన్ సర్కార్ కి అన్నీ సవాళ్ళే. అసలు ఆయన ప్రభుత్వమే ఇబ్బందుల్లో ఏర్పడింది. ఆర్ధికంగా లోటు ఉన్న రాష్ట్రం. సరైన ఆర్ధిక వనరులు లేని చోట భిన్న [more]
జగన్ సర్కార్ కి అన్నీ సవాళ్ళే. అసలు ఆయన ప్రభుత్వమే ఇబ్బందుల్లో ఏర్పడింది. ఆర్ధికంగా లోటు ఉన్న రాష్ట్రం. సరైన ఆర్ధిక వనరులు లేని చోట భిన్న ప్రాంతాలు, అనేక రకాలైన అభిప్రాయాలు. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న ఆంధ్రాకు యువ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. ఆయన ఎకాఎకీన సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఆయనకు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. ఇక ఆయన ఎంచుకున్న పాతిక మంది మంత్రుల విషయం తీసుకున్నా అదే రకంగా ఉంటుంది. అంతా కొత్తవారు, జగన్ కి వీర విధేయులు అన్న కారణంగా మంత్రి పదవులు దక్కాయి. ఇక సామాజిక న్యాయం, రాజకీయ సమీకరణాలు అన్నీ కలసి మంత్రి కుర్చీ అందుకున్న వారు కూడా ఉన్నారు. ఉన్నంతలో నలుగురైదుగురు మంత్రులు మాత్రమే గట్టిగా ఉంటారు. వారే ఇపుడు జగన్ కి ఆపద సమయంలో అక్కరకు వస్తున్నారు.
కీలకమైన వేళ…..
నిజానికి ఏపీలో కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న కారణంతో స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. అయితే ఆ సమయానికి ఏపీలో ఆరొగ్య మంత్రి ఎవరు అన్న ప్రశ్న ఏకంగా మీడియా నుంచే రావడం విచిత్రమే. అప్పటికి పది నెలల పాలన పూర్తి అయింది కానీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైద్య మంత్రి ఆళ్ళ నాని తనను తాను గట్టిగా రుజువు చేసుకోలేకపోయారు. సాధారణంగా ఆరోగ్య మంత్రులకు పని తక్కువగానే ఉంటుంది. ఎపుడో ఇలాంటి పెను విపత్తులు వచ్చినపుడే వారు సీన్ లోకి వచ్చి మొత్తం ఫోకస్ అవుతారు. అయితే మొదటి నుంచి ఆళ్ళ నాని సైలెంట్ గానే ఉంటూ వచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన గొంతు పెద్దగా వినిపించలేదు. దాంతో ఆయన ఇపుడు కరోనా వైరస్ వేళ ఏపీలో ఎలా హ్యాండిల్ చేస్తారన్న సందేహాలు అందరికీ కలిగాయి.
చూపించాల్సిన తీరున…..
ఇక పెను సంక్షోభం వచ్చినపుడు మంత్రులు పాలకులు తమ సామర్ధ్యాన్ని గట్టిగా చాటుకుంటారు. తెలంగాణాలో తీసుకుంటే ఈటెల రాజేందర్ ఆరోగ్య మంత్రిగా చాలా దూకుడు మీద ఉన్నారు. సమీక్షలు నిర్వహించడం, ఎప్పటికపుడు ఆదేశాలు జారీ చేస్తూ అధికారులను, సిబ్బందిని పరుగులు తీయించడం వంటివి ఆయన చేస్తూ వచ్చారు. ఓ దశలో కేసీయార్ ఎంటర్ కానంతవరకూ ఈటెలే మొత్తానికి మొత్తం భుజాల మీద వేసుకుని పనిచేశారు. మరి ఏపీలో అలాంటి సీన్ ఎక్కడా కనిపించలేదు. ఆళ్ళ నాని స్వతహాగా నెమ్మదస్తుడు, దానికి తోడు తొలిసారి మంత్రి అయ్యారు. ఆ బెరుకు తడబాటు ఆయనలో చాలానే కనిపించింది. ఇక ఆయనకు ఈ అతి పెద్ద టాస్క్ ని మోయడం కష్టతరం అయినట్లుగా ఉంది. ఆయన పక్కన మరో ఇద్దరు మంత్రులను కూడా అక్కడికీ జగన్ సెట్ చేసినా కూడా ఆయన మీడియా ముందు ఎందుకో తేలిపోతున్నారు. దాంతీ సీన్లో రెండవ నానికి దించాల్సి వచ్చింది. ఆయనే పేర్ని నాని.
పెద్ద గొంతుకయ్యారు…
పేర్ని నాని సీనియర్ ఎమ్మెల్యే. ఆయన వాగ్ధాటి కూడా విపక్షాలను చెడుగుడు ఆడిస్తుంది. అదే సమయంలో ఆయన మీడియా బ్రీఫింగ్ కూడా అర్ధవంతంగా సాగుతుంది. జగన్ సర్కాని పూర్తిగా రక్షిస్తూ అందరి విమర్శలకు ఒక్క జవాబుతో కట్టిపారేసే దమ్ము పేర్ని నానికి ఉంది. ఆయన గతంలో కూడా అనేక కీలక సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చి తన ధాటిని చూపించారు. ఇపుడు కూడా మళ్ళీ ఆయన్నే జగన్ రంగంలోకి దించారు. కరోనా వైరస్ విషయంలో వాస్తవాలు జనాలకు మీడియా ముఖంగా చెప్పడంతో పాటు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు కూడా చక్కగా వివరిస్తూ పేర్ని నాని కీలకమైన వేళ బాగానే రాణిస్తున్నారు. నిజానికి పేర్ని నాని సమాచార మంత్రి మాత్రమే. ఆయన శాఖ ఇది కాదు, కానీ వైద్య మంత్రి అవతారం కూడా ఆయనే ఎత్తేశారు. మరో వైపు సీఎం జగన్ మీడియా ముందుకొచ్చి ఏదీ మాట్లాడరు, వైద్య మంత్రి ఆళ్ళ నాని ఫోకస్ కాలేకపోతున్నారు దాంతో మొత్తం లోటుని ఒంటిచేత్తో భర్తీ చేస్తూ పేర్ని నాని తన సత్తా చాటుకుంటున్నారు. మొత్తానికి ఏ నాని అయితేనేం సర్కార్ పరువు నిలబడుతోందిగా అంటున్నారు వైసీపీ పెద్దలు.