ఈ మంత్రికి ఆయనతో అస్సలు పడటం లేదట
కృష్ణా జిల్లా వైసీపీలో లుకలుకలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రాజకీయ నాయకులు రెండు గ్రూపులుగా ఏర్పడిన పరిస్థితి క్లీయర్‌గా కనిపిస్తోంది. కొందరు ఎంపీ వర్గంగా ఏర్పడితే మరికొందరు మంత్రి [more]
;
కృష్ణా జిల్లా వైసీపీలో లుకలుకలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రాజకీయ నాయకులు రెండు గ్రూపులుగా ఏర్పడిన పరిస్థితి క్లీయర్‌గా కనిపిస్తోంది. కొందరు ఎంపీ వర్గంగా ఏర్పడితే మరికొందరు మంత్రి [more]
కృష్ణా జిల్లా వైసీపీలో లుకలుకలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రాజకీయ నాయకులు రెండు గ్రూపులుగా ఏర్పడిన పరిస్థితి క్లీయర్‌గా కనిపిస్తోంది. కొందరు ఎంపీ వర్గంగా ఏర్పడితే మరికొందరు మంత్రి పేర్ని నాని వర్గంగా మారిపోయిన పరిస్థితి ఉంది. మరోమంత్రి కొడాలి నానికి అందరూ దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. కొన్నాళ్లుగా ఈ లుకలుకలు వినిపిస్తున్నా.. ఇప్పుడు స్థానిక సమరం మరోసారి తెరమీదికి రావడంతో గ్రూపు రాజకీయాలు మరింత పెరిగాయని అంటున్నారు. పేర్ని నాని వర్గం ఎక్కువ దూకుడుగా ఉందని.. ఎంపీ వర్గం సైలెంట్‌గా పనిచేయించుకుని పోతోందని అంటున్నారు. అయితే.. ఈ రెండు గ్రూపుల్లోనూ ఉన్న నాయకులకు ఒకరంటే.. ఒకరికి పడడం లేదని చెబుతున్నారు.
ఎంపీ వర్సెస్ మంత్రి…..
ఇటీవల మచిలీపట్నం పోర్టు పనులకు సంబందించి.. ఎంపీ బాలశౌరి.. కొన్ని నిర్ణయాలను.. సూచనలను సీఎం జగన్‌కు వివరించే ప్రయత్నం చేశారు. సీఎం జగన్‌కు సన్నిహితుడు కావడం.. ఢిల్లీలో వైసీపీ రాజకీయాలకు కేరాఫ్‌గా కూడా ఇటీవల కాలంలో శౌరి కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన తనకు ఎప్పుడు అవసరం ఉన్నా.. నేరుగా వెళ్లి జగన్‌ను కలుస్తున్నారు. అయితే.. ఇలా నేరుగా కలిసి నియోజకవర్గం సమస్యలను జగన్‌కు వివరించడంపై మచిలీపట్నం ఎమ్మెల్యే కం మంత్రి పేర్ని నాని వ్యతిరేకిస్తున్నారు. ఏదైనా ఉంటే.. ముందు నాతో చర్చించాలి కదా..! అనేది అంతర్గత ఆవేదన. దీంతో ఎంపీకి, మంత్రి పేర్ని నానికి మధ్య దూరం పెరిగింది. ఇది.. గ్రూపు రాజకీయాలకు తెరదీసింది.
అనేక అంశాల్లో తేడా……
కొన్నాళ్ల కిందట.. టీడీపీ మాజీ మంత్రి ఒకరు ఓ హత్య కేసులో ఇరుక్కోవడం తెలిసిందే. పేర్నినానికి అత్యంత సన్నిహితుడి హత్య జరిగింది. ఈ కేసులో మాజీ మంత్రిని అరెస్టు చేశారు. అయితే.. ఈ విషయంలో స్థానికంగా కొందరు వైసీపీ నేతలు మౌనం పాటించారు. సమయానికి కొందరు వైసీపీ నేతల నుంచి సరైన మద్దతు లభించలేదు. ఇది కూడా పేర్ని నానికి తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ పరిణామాలతోనే బాలశౌరికి-నానికి మధ్య దూరం పెరుగుతోందని విశ్లేషకులు కూడా కొన్నాళ్లుగా చెబుతున్నారు. అయితే.. తాజాగా సీఎం జగన్ కేంద్రంగా కూడా వీరు తమ వ్యవహారాన్ని మార్చుకోలేక పోతున్నారని అంటున్నారు.
ఆయన తో కలసి వెళ్లేందుకు…..
మచిలీపట్నం పోర్టు విషయంపై మాట్లాడేందుకు ఎంపీ బాలశౌరి వెళ్లగా.. పేర్ని నానితో కలిసి రావాలని జగన్ సూచించారట. దీంతో శౌరి.. ఇక.. అప్పటి నుంచి ఈ విషయాన్ని పక్కన పెట్టారని అంటున్నారు పరిశీలకులు. ఈ సంఘటన తర్వాత పేర్ని నాని వర్సెస్ శౌరి వార్ మరింత ముదిరింది. రాష్ట్రంలో మిగిలిన జల్లాలతో పోలిస్తే కృష్ణా వైసీపీలో నేతల మధ్య చిన్నా చితకా వివాదాలు మినహా పెద్ద గొడవలు లేవనుకుంటోన్న టైంలో ఈ ఇద్దరు నేతల సైలెంట్ వార్ జిల్లా అధికార పార్టీలో మరిన్ని పరిణామాలకు దారితీయనుందని తెలుస్తోంది.