ఆ సీనియర్‌ మంత్రి అడ్రస్‌ ఎక్కడ…?

ఎన్నో ఆశలు, ఆశయాలతో ఏపీలో కొలువు దీరిన జగన్‌ ప్రభుత్వం.. నవరత్నాల అమలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు జగన్‌ [more]

;

Update: 2019-08-07 11:00 GMT

ఎన్నో ఆశలు, ఆశయాలతో ఏపీలో కొలువు దీరిన జగన్‌ ప్రభుత్వం.. నవరత్నాల అమలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు జగన్‌ అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన కేబినెట్‌ కూర్పులోనే తన సత్తా చాటారు జగన్‌. ఈ క్రమంలోనే అమలాపురం నుంచి పోటీ చేసి గెలిచిన సీనియర్‌ రాజకీయ నాయకుడు, వైసీపీ నేత పినిపే విశ్వరూప్‌కు తన కేబినెట్‌లో మంత్రి పదవిని ఇచ్చారు.

కేబినెట్ లో బెర్త్ దక్కించుకుని….

ఆయన చాలా సీనియర్‌ గురూ! అనే రేంజ్‌లో గతంలో కాంగ్రెస్‌ హయాంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి, దీనికి ముందు రోశయ్య కేబినెట్‌లలో పినిపే పనిచేశారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన పినిపే విశ్వరూప్‌ సమైక్య వాదిగా ముద్రపడ్డారు. అయితే, కొన్నా ళ్ల తర్వాత ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నిక‌ల్లో అమ‌లాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక తాజా ఎన్నిక‌ల్లో తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దాదాపు 26 వేల భారీ మెజారిటీతో టీడీపీ నుంచి పోటీ చేసిన అయితాబత్తుల ఆనంద రావును ఓడించారు. దీంతో జగన్‌ తన కేబినెట్‌లో సీటు ఇచ్చారు.

రెండు మాసాలవుతున్నా….

ప్రస్తుతం ఆయ‌న సాంఘీక సంక్షేమ శాఖా మంత్రిగా కొన‌సాగుతున్నారు. నిజానికి సీనియర్‌ మంత్రిగా అనేక సూచనలు చేయడంతోపాటు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చక్కటి కౌంటర్లు విసిరే అవకాశం ఉంది. అయితే, ఆయన మాత్రం మౌనం వహిస్తున్నారు. కారణం తెలియదు కానీ, మంత్రి పదవి దక్కని వారు దక్కలే దని భావిస్తుంటే.. పినిపే విశ్వరూప్‌ వంటి నాయకుడు ఇలా మౌనం దాల్చడం వెనుక రీజన్‌ అర్థం కాక జిల్లా నాయకులు తల పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో జగన్‌ కేబినెట్‌ ఏర్పడి .. రెండు మాసాలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఎక్కడా పినిపే విశ్వరూప్‌ ఒక్క ప్రెస్‌ మీట్‌ పెట్టడం కానీ, తన శాఖకు సంబంధించిన సమస్యలపై చర్చించడం కానీ చేయకపోగా.. మీడియాకు కూడా అందుబాటులో లేక పోవడం గమనార్హం.

చురుగ్గా లేరే….

ఇక, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా ఎక్కడా పాల్గొనక పోవడం గమనార్హం. దీంతో పినిపే విశ్వరూప్‌ కు నచ్చిన శాఖ ఇవ్వలేదని అలక బూనారా ? అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అస‌లే తూర్పు గోదావ‌రి ఏపీలోనే పెద్ద జిల్లా. ఈ జిల్లా నుంచి విశ్వరూప్‌తో పాటు జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్‌, కుర‌సాల క‌న్నబాబు లాంటి వాళ్లు దూసుకుపోతుంటే విశ్వరూప్ మాత్రం ఎక్కడా క‌న‌ప‌డ‌డం లేదు. మరి ఆయన ఎప్పుడు అందుబాటులోకి వస్తారో చూడాలి.

Tags:    

Similar News