పినిపే రాజకీయాల్లో ఆ స్పీడేదీ? ఇలా అయితే కష్టమేనా?
పినిపే విశ్వరూప్. వైసీపీ అధినేత జగన్ కేబినెట్‌లో సాంఘిక సంక్షేమ(సోషల్ వెల్ఫేర్) మంత్రిగా బాధ్యత లు నిర్వహిస్తున్నారు. గతంలోనూ ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. [more]
పినిపే విశ్వరూప్. వైసీపీ అధినేత జగన్ కేబినెట్‌లో సాంఘిక సంక్షేమ(సోషల్ వెల్ఫేర్) మంత్రిగా బాధ్యత లు నిర్వహిస్తున్నారు. గతంలోనూ ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. [more]
పినిపే విశ్వరూప్. వైసీపీ అధినేత జగన్ కేబినెట్‌లో సాంఘిక సంక్షేమ(సోషల్ వెల్ఫేర్) మంత్రిగా బాధ్యత లు నిర్వహిస్తున్నారు. గతంలోనూ ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఎస్సీ వర్గానికి చెందిన పినిపే విశ్వరూప్‌కు అటు వైఎస్ ఇటు ఆయన తనయుడు జగన్ కూడా ఎంతో ప్రాధాన్యం ఇచ్చారనడంలో సందేహం లేదు. అయితే, గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు చాలా దూకుడుగా ఉన్న మంత్రిగా అభివృద్ధికి పర్యాయపదంగా మారిన పినిపే విశ్వరూప్ ఇప్పుడు మాత్రం పెద్దగా దూకుడు ప్రదర్శించడం లేదనే టాక్ వినిపిస్తోంది. అసలు ఆయన మంత్రిగా ఉన్నారా ? అన్న సందేహాలు కూడా వైసీపీ నేతలే వ్యక్తం చేస్తోన్న పరిస్థితి.
నామ్ కే వాస్తేగా….
దూకుడు అంటే.. ఒకరిద్దరు మంత్రుల మాదిరిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయమని కాదు.. ప్రభుత్వం తాలూకు పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ, తన మంత్రిత్వ శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృ ద్ది జరిగేలా ఆయా వర్గాలకు న్యాయం జరిగేలా వ్యవహరించడంలోనూ ముందుండాలనేది జనం టాక్. అదే సమయంలో నియోజకవర్గంలోనూ అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నారు. కానీ, పినిపే విశ్వరూప్ నామ్‌కే వాస్తే.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏడాది నుంచి ఆయన మంత్రిగా ఉన్నా అటు రాష్ట్ర స్థాయిలో కాదు కదా కనీసం తూర్పు గోదావరి జిల్లాలోనూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.
ట్రెండ్ మారుతున్నా….
ఇక ఆయన ప్రాథినిత్యం వహిస్తోన్న అమలాపురం నియోజకవర్గం ప్రజలు కూడా ఈ మాటే అంటున్నారు. ఏడాది కాలంలో పినిపే విశ్వరూప్‌ను ఎమ్మెల్యేగా గెలిపించినా.. ఆయన మంత్రిగా ఉన్నా తమకు ఒరిగిందేమి లేదని ఈ నియోజకవర్గంలో మెజార్టీ ప్రజల నుంచి వినిపిస్తోన్న మాట. ఇక్కడి ప్రజల మైండ్ సెట్ ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. గత రెండున్నర దశాబ్దాలుగా వ్యక్తితో సంబంధం లేకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే పట్టం కడుతున్నారు. ( ఓసారి ఇండిపెండెంట్ మినహా). ఈ క్రమంలోనే ఇక్కడ దశాబ్దంన్నరగా పాతుకుపోయిన విశ్వరూప్ తన బ్రాండ్ సెట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. రెండుసార్లు మంత్రిగా ఉన్నా ఆయన అమలాపురంలో మెట్ల సత్యనారాయణ లాంటి నేతల రేంజ్‌లో ప్రభావం చూపలేకపోయారు.
నిరూపించుకోలేకపోతే….
ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం దూకుడు లేని నేపథ్యంలో అధికార పార్టీ ప్రవేశ పెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకుఎంతో అవకాశం ఉంది. అదే సమయంలో తన స్థానాన్ని సుస్ధిరం చేసుకునేందుకు కూడా పినిపే విశ్వరూప్‌కి ఛాన్స్ ఉంది. అయినా కూడా పినిపే సరైన విధంగా వ్యవహరించడం లేదని అంటున్నారు. అదే సమయంలో ఆయన వ్యక్తిగతంగా కూడా పుంజుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఎంత సేపూ పార్టీ జెండా నీడన కాకుండా.. తనకంటూ .. కొంత బ్యాక్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. పినిపే విశ్వరూప్ దూకుడు పెంచకపోతే త్వరలో జరిగే కేబినెట్ మార్పులు చేర్పుల్లో లేదా రెండున్నరేళ్ల తర్వాత జరిగే ఊస్టింగుల్లో అయినా ఆయన బెర్త్ ఊడిపోవచ్చన్నదే రాజకీయ వర్గాల టాక్..?