పితానికి పితలాటకమేనా?
రాష్ట్రంలో ఒక్కసారిగా అలజడి రేపిన ఈఎస్ఐ కుంభకోణం లోతుపాతులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నా యి. 2014లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత శ్రీకాకుళం జిల్లా [more]
;
రాష్ట్రంలో ఒక్కసారిగా అలజడి రేపిన ఈఎస్ఐ కుంభకోణం లోతుపాతులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నా యి. 2014లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత శ్రీకాకుళం జిల్లా [more]
రాష్ట్రంలో ఒక్కసారిగా అలజడి రేపిన ఈఎస్ఐ కుంభకోణం లోతుపాతులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నా యి. 2014లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకి కార్మిక శాఖ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. ఆ సమయంలో ఈ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో ఔషధాల కొనుగోలు, నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతోపాటు తమ జేబుల్లో వేసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. గత ఆరేళ్లుగా ఈఎస్‌ఐలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు విజిలెన్సు అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు.
వాస్తవ ధర కంటే?
మందుల కొనుగోళ్లలో రూ.900 కోట్లకు పైగా భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఓ నివేదికను విడుదల చేసింది. ఆరేళ్లుగా కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను స్వాహా చేసినట్లు విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. నకిలీ కొటేషన్లు సృష్టించి రేట్ కాంట్రాక్టులో లేని సంస్థలనుంచి మందులు కొనుగోలు చేసి నట్లు తెలిపారు. ప్రభుత్వం రూ. 89 కోట్లు చెల్లిస్తే, అందులో రేట్ కాంట్రాక్ట్ లో ఉన్న సంస్థలకు 38 కోట్లు చెల్లించినట్టు గుర్తించారు. మిగతా రూ. 51 కోట్లను దారి మళ్లించి రేట్ కాంట్రాక్ట్ లేని సంస్థలకు వాస్తవ ధర కం టే 132 శాతం అధనంగా అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి.
నకిలీ బిల్లులతో….
అయితే, ఈ కుంభకోణం మొత్తంలోనూ మాజీ మంత్రి అచ్చెన్న పేరుతో పాటు ఆయన తర్వాత కార్మిక శాఖ పగ్గాలు చేపట్టిన మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ప్రమేయం కూడా ఉందని అధికారులు గుర్తించడం ఇప్పుడు సంచలనానికి మరింత తీవ్రత పెంచింది. తన వాళ్లకు చెందిన టెలీ హెల్త్ సర్వీసెస్ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించాలని ఈఎస్‌ఐ డైరెక్టర్లకు లేఖ రాసినట్లు తెలిసింది. మంత్రి చొరవతోనే సదరు డైరెక్టర్లు రూ. 975 కోట్ల మందుల కొనుగోలు చేసి, అందులో 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులను సృష్టించినట్లు ఆరోపణలున్నాయి.
విచారణకు సిద్ధమంటూ….
అయితే మందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 293 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, 698 కోట్ల రూపాయలకు మందులను కొనుగోలు చేసినట్లు ప్రభుత్వానికి చూపి ఖజానాకు 404 కోట్ల రూపాయలు నష్టం కలిగించారు. మొత్తంగా చూస్తే.. ఈ వ్యవహారం తీవ్ర దుమారానికి దారితీసే అవకాశం ఉందని అంటున్నారు. పితాని మాత్రం తాను మంత్రిగా ఉన్నప్పుడే డైైరెక్టర్ల పై విచారణకు ఆదేశించానన్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్నారు. మరి ఏం జరుగుతుందో ? చూడాలి. మొత్తానికి ఏపీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మాజీ మంత్రులు అచ్చెన్న, పితాని బుక్ అవుతారా ? అన్న సందేహాలు అయితే వస్తున్నాయి.