పాపం.. పితాని.. కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా?
రాజకీయాల్లో ఆయన చాలా సీనియర్. మూడు సార్లు మంత్రిగా కూడా చక్రం తిప్పారు. కాంగ్రెస్‌కు, వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా గుర్తింపు పొందారు. ఆయనే పితాని సత్యనారాయణ. [more]
;
రాజకీయాల్లో ఆయన చాలా సీనియర్. మూడు సార్లు మంత్రిగా కూడా చక్రం తిప్పారు. కాంగ్రెస్‌కు, వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా గుర్తింపు పొందారు. ఆయనే పితాని సత్యనారాయణ. [more]
రాజకీయాల్లో ఆయన చాలా సీనియర్. మూడు సార్లు మంత్రిగా కూడా చక్రం తిప్పారు. కాంగ్రెస్‌కు, వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా గుర్తింపు పొందారు. ఆయనే పితాని సత్యనారాయణ. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరారు. కాంగ్రెస్‌లో ఉండగా రెండు సార్లు.. టీడీపీలోకి వచ్చిన తర్వాత ఒక సారి ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే, ఇప్పుడు టీడీపీ అధికారం కోల్పోవడం సహా గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలవడం శాపంగా మారింది. ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, రేపో మాపో ఆయనపై కేసులు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు.
సోషల్ మీడియాలో….
ముఖ్యంగా తెలుగు దేశం పార్టీని నమ్ముకున్నతనకు అదే పార్టీ నుంచి పరాభవం ఎదురవుతోందని పితాని సత్యనారాయణ చింతిస్తున్నారు. దీంతో ఇటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేక అసలు పార్టీలో ఉండాలా? వద్దా? అనే సందేహంలోను ఆయన తలమునకలయ్యారు. దీంతో గత వారం పది రోజులుగా సదరు మాజీ మంత్రి రాజకీయాల గురించి సోషల్ మీడియాలో.. మెయిన్ మీడియాలో హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. విషయంలోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకు డు పితాని సత్యనారాయణ. మాస్ నాయకుడిగాను క్లాస్ నేతగాను కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. మొదటలో కాంగ్రెస్ నాయకుడిగా ఇక్కడ చక్రం తిప్పారు. ఆ సమయంలో మంత్రిగా ఆయన రెండు దఫాలుగా చక్రం తిప్పారు.
బలమైన సామాజికవర్గంతో….
బీసీల్లో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని సత్యనారాయణకు ఆ వర్గంలో మంచి పట్టు ఉంది. వాస్తవానికి ఆచంట, గతంలో పెనుగొండ నుంచి ఆయన వరుసగా మూడుసార్లు గెలవడం వెనక కులా రాజకీయాల ప్రభావమే ఎక్కువుగా ఉందన్నది వాస్తవం. అయితే చివర్లో ఈ కుల రాజకీయాలు మరీ ఎక్కువ కావడంతోనే ఆయన ఓడిపోయారు. ఇక రెండు సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో 2014లో టీడీపీ పంచన చేరి ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. ఆ క్రమంలోనే 2017లో ఆయనకు చంద్రబాబు మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇక, గత ఏడాది ఎన్నికల్లో పితాని సత్యనారాయణ పరాజయం పాలయ్యారు. ఇంత వరకు ఏ నాయకుడికైనా సహజమైన పరిణామాలే ఎదురైనట్టు పితానికి కూడా అలాంటి పరిణామాలే ఎదురయ్యాయి.
పార్టీ పరంగా…..
అయితే, ఇప్పుడు ఆయనపై ఈఎస్ఐ కుంభ కోణం తాలూకు నీడలు పడ్డాయి. కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో (టీడీపీ హయాంలో) ఈఎస్ఐ మందుల కుంభకోణంలో పితాని సత్యనారాయణ కూడా పాత్ర పోషించారని ఆరోపణలు వచ్చాయి. వీటిని తనకు అనుకూలంగా మార్చుకున్న వైసీపీ పితానిని టార్గెట్ చేసింది. ఆయనపై మంత్రులు, నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రేపో మాపో ఆయనపై కేసులు కూడా నమోదవుతాయనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ క్రమంలో వాటిని ఆయన తిప్పి కొడుతున్నా.. టీడీపీ పార్టీ పరంగా మాత్రం ఆయనకు ఎలాంటి మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే కీలక నిర్ణయం…?
పార్టీని నిలబెట్టేందుకు తాను ఎంతో కృషి చేశానని, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే ఎన్నికల్లో పోటీ చేశానని, నీతిగానే తాను మంత్రిగా చక్రం తిప్పానని, కానీ, ఇప్పుడు తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పార్టీ నుంచి తనకు ఎలాంటి సపోర్టు లేకుండా పోయిందనే ఆవేదనను పితాని సత్యనారాయణ వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలతో ఆయన చాలా డీలా పడ్డారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటు నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు టోటల్‌గా పితాని సత్యనారాయణ వర్గాన్ని తన వైపునకు తిప్పేసుకుంటూ పితానిని బలహీన పరచడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు.మొత్తానికి ఆయన అనుచరులు కూడా దీనిని అవమానంగానే భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో త్వరలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. మరి ఏంజరుగుతుందో ? చూడాలి.