ఆయనే అడ్డు అట.. లేకుంటేనా… పితాని?

మాజీ మంత్రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన నాయ‌కుడు, సీనియ‌ర్ రాజ‌కీయ నేత పితాని స‌త్యనారాయణ రాజ‌కీయం ఎటు దారితీస్తుంది ? ఆయ‌న ఏ పార్టీలో ఉన్నారు [more]

;

Update: 2020-04-27 02:00 GMT

మాజీ మంత్రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన నాయ‌కుడు, సీనియ‌ర్ రాజ‌కీయ నేత పితాని స‌త్యనారాయణ రాజ‌కీయం ఎటు దారితీస్తుంది ? ఆయ‌న ఏ పార్టీలో ఉన్నారు ? రేపు ఏ పార్టీలోకి జంప్ చేయాల‌ని అనుకుంటున్నారు ? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్న దాని ప్రకారం అయితే పితాని స‌త్యనారాయణ ప్రస్తుతానికి రెండు ప‌డ‌వ‌ల‌పై ప్రయాణం చేస్తున్నార‌ని అంటున్నారు. నిజానికి కాంగ్రెస్‌లో సీనియ‌ర్ నాయ‌కుడిగా, మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. ఆచంట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న విజ‌యం సాధించి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాను ఒకానొక ద‌శ‌లో శాసించారు.

ఏ పార్టీలోకి వెళ్లినా…..

కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్న పితాని స‌త్యనారాయణ కిర‌ణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జిల్లా రాజ‌కీయాలు శాసించారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లోనే ఆయ‌న టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి వైఎస్ కుటుంబంతోనూ పితానికి ద‌గ్గర సంబంధాలు ఉన్నాయి. వైఎస్ ప్రోద్బలంతోనే ఆయ‌న కాంగ్రెస్‌లో కీల‌క నాయ‌కుడిగా ఎదిగారు. త‌ర్వాత మంత్రి ప‌ద‌విని కూడా తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌నకు 2014లో వైసీపీ నుంచే ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే, ఆ స‌మ‌యంలో జ‌గ‌న్‌పై కేసులు ఉండ‌డం, మ‌రోప‌క్క, చంద్రబాబు గెలుస్తార‌నే ధీమాతో ఆ పార్టీలోకి వెళ్లి ఆచంట నుంచి విజ‌యం సాధించారు.

ఈఎస్ఐ కుంభకోణంలో…..

2014 ఎన్నిక‌ల‌కు ముందు మాజీ ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్ రెడ్డి జై స‌మైక్యాంధ్ర పార్టీలోకి వెళ్లి నాలుగు రోజు వ్యవ‌ధిలోనే మూడోసారి పార్టీ మారి టీడీపీలోకి జంప్ చేసిన ఘ‌న‌త కూడా పితాని స‌త్యనారాయణదే. ఈ క్రమంలోనే త‌ర్వాత కాలంలో బాబు హ‌యాంలోనూ మంత్రిగా ప‌నిచేశారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల ముందు కూడా వైసీపీ నుంచి పితానికి ఆహ్వానం అందింది. అయితే, ఆయ‌న పార్టీ మార‌కుండా టీడీపీలోనే ఉండి ఆపార్టీ త‌ర‌ఫునే పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. ఇంత వ‌రకు బాగానే ఉన్నా.. ఓడిపోయిన త‌ర్వాత పార్టీ ఆయ‌నను ప‌ట్టించుకోలేద‌నే మాన‌సిక ఆందోళ‌న‌లో ఉన్నారు.పైగా ఇటీవ‌ల ఈఎస్ ఐ కుంభ‌కోణంలో ఆయ‌న పాత్ర కూడా ఉంద‌ని వైసీపీ ప్రభుత్వం బ‌య‌ట‌పెట్టడం, విచార‌ణ‌కు ఆదేశిస్తామ‌ని ప్రక‌టించింది.

అవసరాల కోసమే…?

ఈ నేప‌థ్యంలోనూ చంద్రబాబు నుంచి ఆయ‌న‌కు సాంత్వన ల‌భించ‌లేదు. ఈ త‌రుణంలో టీడీపీలో ఉండ‌డం ఎందుక‌నే మాట అనుచ‌రుల నుంచి వినిపించింది. అయిన‌ప్పటికీ ఆయ‌న ఎటూ తేల్చుకోలేక‌పోతున్నారు. వైసీపీ నుంచి ఆహ్వానం అందితే.. చాల‌ని ఆయ‌న చూస్తున్నారు. కానీ, ఇక్కడ నుంచి మంత్రిగా ఉన్న రంగ‌నాథ‌రాజు మాత్రం పితాని స‌త్యనారాయణకి అడుగ‌డుగునా అడ్డు ప‌డుతున్నారు. దీంతో అటు టీడీపీలో ఉండ‌లేక‌, ఇటు వైసీపీ నుంచి కూడా ఆహ్వానం లేక పితాని రెండు ప‌డ‌వ‌ల‌పై కాళ్లేశార‌నే వాద‌న వినిపిస్తోంది. ట్విస్ట్ ఏంటంటే పితాని స‌త్యనారాయణ టీడీపీ నుంచి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎవ‌రైనా టీడీపీ నేత‌లు ఆయ‌న ద‌గ్గర‌కు ప‌నుల కోసం వెళితే మీ పార్టీలో ప‌నులు అంత త్వర‌గా కావ‌య్యా ? అని చంద్రబాబును వెట‌కారం చేసేవార‌న్నది ఓపెన్ సీక్రెట్‌. అంటే పితాని ప‌ద‌వులు.. అవ‌స‌రాల కోస‌మే టీడీపీలో ఉన్నార‌న్నది ఆయ‌న మాట‌లే చెప్పేస్తున్నాయ్‌…!

Tags:    

Similar News