టీడీపీలో ఉండాలా… వెళ్లాలా… పితానికి వైసీపీ ఆఫర్…?
మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు ఉన్న రాజకీయ లౌక్యమే వేరు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో ఆయనది అందెవేసిన చేయి. వైఎస్ ఉన్నప్పుడు ఆయనతో అంటకాగి [more]
మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు ఉన్న రాజకీయ లౌక్యమే వేరు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో ఆయనది అందెవేసిన చేయి. వైఎస్ ఉన్నప్పుడు ఆయనతో అంటకాగి [more]
మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు ఉన్న రాజకీయ లౌక్యమే వేరు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో ఆయనది అందెవేసిన చేయి. వైఎస్ ఉన్నప్పుడు ఆయనతో అంటకాగి మంత్రి పదవి దక్కించుకున్న పితాని సత్యనారాయణ ఆ తర్వాత రోశయ్యకు భజన చేశారు. చివరకు కిరణ్ కుమార్ రెడ్డి పితానిని బాగా నమ్మడంతో జిల్లా రాజకీయాల్లో ఆయన కింగ్ మేకర్ అయ్యారు. చివరకు కిరణ్‌కుమార్ జై సమైక్యాంధ్ర పార్టీలో కీలక పదవి దక్కించుకున్న పితాని.. ఆ పార్టీ అధికారంలోకి రాదని తెలిసి 2014 ఎన్నికల వేళ టీడీపీలోకి జంప్ చేసేశారు. ఆ తర్వాత చంద్రబాబును మచ్చిక చేసుకుని మంత్రి పదవి దక్కించుకున్నారు. గత ఎన్నికలకు ముందే టీడీపీ ఇబ్బందుల్లో ఉండడంతో వైసీపీలోకి వెళ్లాలా ? వద్దా ? అన్న మీమాంసలోనూ పడ్డారు.
స్కామ్ దెబ్బకు….
నాడు వైసీపీ పితాని సత్యనారాయణకు ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు.. ఆ తర్వాత మంత్రి పదవి ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో నరసాపురం ఎంపీ సీటు తానేం చేసుకోనని ఆ పార్టీ నేతలకు తెగేసి చెప్పడంతో పాటు చివరకు టీడీపీలో పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచే ఆయనకు పార్టీలో ఉండడం ఇష్టం లేదు. పైగా పదిహేనేళ్ల పాటు అధికారం అనుభవించిన పితాని ప్రతిపక్షంలో ఉండలేకపోతున్న పరిస్థితి అట. ఇక తన కుమారుడిపై ఈఎస్ఐ స్కామ్ ఆరోపణలు రావడంతో అప్పుడే ఆయన పార్టీ కండువా మార్చేస్తారన్న ప్రచారం జరిగినా సైలెంట్ అయ్యారు. అయితే మాజీ బీసీ మంత్రులు అయిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రపై ఆరోపణలు వచ్చినప్పుడు టీడీపీ అధిష్టానం నుంచి వారికి వచ్చిన సపోర్ట్ పితాని సత్యనారాయణ విషయంలో రాలేదు.
ఎన్నికల వేళ సైలెంట్ గా…..
అప్పుడే పితాని సత్యనారాయణ చంద్రబాబుపై బాగా అలిగారు. ఇటీవల పార్టీ పదవుల్లో ఆయనకు బాగా ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనకు పేరుకు పదవులు ఉన్నా బయటకు వచ్చి మీడియా ముందు బాబుకు.. టీడీపీకి సపోర్ట్ చేస్తోన్న దాఖలాలు లేవు. ఓ వైపు ఏపీలో పంచాయతీ ఎన్నికల హడావిడి జరుగుతున్నా పితాని సత్యనారాయణ నుంచి ఉలుకు పలుకు లేదు. ఇటీవల పితాని కుమారుడు వివాహానికి ఆయన స్వగ్రామం అయిన కొమ్ముచిక్కాల వెళ్లిన చంద్రబాబు పితానిని బుజ్జగించినా ఆయన మాత్రం అలక వీడకుండా ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల వేళ సైలెంట్‌గానే ఉన్న పరిస్థితి.
వైసీపీ నుంచి ఆఫర్ ఉందా ?
పితాని సత్యనారాయణ టీడీపీలో సైలెంట్‌గా ఉండడం వెనక ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారన్న గుసగుసలు కూడా ఆచంటలో వినిపిస్తున్నాయి. ఆయన పార్టీ మారితే జగన్ ఆయన్ను పాలకొల్లుకు పంపే ఆలోచనలో ఉన్నారని వైసీపీలో ఒక వర్గం చెపుతోంది. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఆయన్ను ఢీ కొట్టేందుకు జగన్ అక్కడ ఎన్నో స్కెచ్‌లు వేస్తున్నారు. స్థానిక నేతలకు కీలక పదవులు కట్టబెడుతున్నారు. అయినా అక్కడ పార్టీలో గ్రూపుల గోల ఎక్కువుగా ఉంది. పితాని సత్యనారాయణ లాంటి స్ట్రాంగ్ క్యాండెట్‌ను అక్కడకు పంపితే గ్రూపుల గోల ఎక్కువుగా ఉంది. అందుకే పితాని అక్కడకు వెళితే అందరిని సమన్వయం చేసుకోగలుగుతాడన్నదే వైసీపీ అంచనా కావొచ్చు.
కొత్త నేత అన్వేషణలో టీడీపీ వర్గాలు ?
పితాని సత్యనారాయణ పార్టీ మారిపోతారన్న వార్తలతో ఆచంట టీడీపీలో ఆయన్ను ముందు నుంచి వ్యతిరేకిస్తోన్న వర్గం మాత్రం కొత్త నేత అన్వేషణలో పడింది. ఇక్కడ పితాని సత్యనారాయణ బయటకు వెళితే పార్టీని నడిపించే సత్తా ఉన్న నేత ఎవరన్న లెక్కల్లో పార్టీ నేతలు మునిగి తేలుతున్నారు. మరి పితాని పార్టీ మారతారా ? ఆయన సైలెన్స్ వెనక వ్యూహం ఏంటన్నది చూడాలి.